
శ్రీశైలం ఘాట్‌లో రోడ్డు ప్రమాదం
పెద్దదోర్నాల: ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దదోర్నాల మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్‌లో చిన్నారుట్ల సమీపంలోని మూల మలుపు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై మహేష్ కథనం మేరకు.. శ్రీశైలం నుంచి దోర్నాల వైపు వస్తున్న నూజివీడు డిపో సూపర్ లగ్జరీ బస్సు, బెంగళూరు నుంచి శ్రీశైలం వెళ్తున్న కారు చిన్నారుట్ల సమీపంలో మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారులో ప్రమాణిస్తున్న బెంగళూరు వాసులు రవికుమార్, భాస్కర్, ప్రభావతి వాసుదేవ, తేజశ్వినికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న శ్రీశైలం 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఎదురెదురుగా వస్తున్న కారు, ఆర్టీసీ బస్సు ఢీ
కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలు