
విద్యుదాఘాతంతో తండ్రీకొడుకు మృతి
పొదిలి రూరల్: విద్యుదాఘాతానికి గురై తండ్రీకొడుకు మృతి చెందిన విషాద సంఘటన పొదిలి మండలం కొండాయపాలెం పంచాయతీలోని సలకనూతల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. సలకనూతల గ్రామానికి చెందిన మాదాల పెద్దకోటయ్య(60), రెండో కుమారుడు వెంకటేశ్వర్లు(25)తో కలిసి పొలం నుంచి నేరుగా తమ ఇంటి సమీపంలోని పొగాకు బ్యారన్ వద్దకు చేరుకున్నాడు. వర్షానికి బ్యారన్ వద్ద చిత్తడిగా మారడం, విద్యుత్ ప్రసరించడంతో ఇద్దరూ ఒక్కసారిగా కుప్పకూలారు. పెద్దకోటయ్య అక్కడికక్కడే మృతి చెందగా, వెంకటేశ్వర్లును పొదిలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటేశ్వర్లు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విద్యుత్ షాక్‌తో తండ్రీకుమారుడు మరణించగా ట్రాక్టర్ ఢీకొని చనిపోయారని ప్రచారం జరగడం అనుమానాలకు తావిచ్చింది. ఒకేసారి తండ్రి, కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల అర్తనాదాలు మిన్నంటాయి.
పొదిలి మండలం సలకనూతలలో విషాద ఘటన

విద్యుదాఘాతంతో తండ్రీకొడుకు మృతి