
చిరుత పులి దాడిలో గేదె మృతి
హనుమంతునిపాడు: చిరుతపులి దాడిలో గేదె మృతిచెందిన ఘటన మండలంలోని హనుమంతాపురం పంచాయతీ నారాయపల్లె గ్రామ సమీపంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన బత్తుల బాలగురవయ్య గేదెలు పొలానికి తోలాడు. ఒక గేదె ఇంటికి తిరిగిరాలేదు. మూడు రోజుల నుంచి గేదె రాకపోవడంతో పొలానికి వెళ్లి వెతుకుతున్నారు. శనివారం గ్రామ సమీపాన అడవిలో చిరుత పులి దాడిలో గేదె మృతిచెంది ఉండటం గుర్తించారు. అక్కడ చిరుత పులి చంపి తిన్నట్లు ఆనవాళ్లు ఉండటంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఒంగోలు సిటీ: ఒంగోలులోని పింగళి కోదండరామయ్య ఓరియంటల్ స్కూల్ విద్యార్థి మర్రిపూడి సాయి 69వ స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్య పతకం శనివారం సాధించాడు. రాజమండ్రిలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీల్లో అండర్–14 విభాగంలో సాయి ఈ విజయం సాధించాడు. ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నల్లమల్లి కోటి సూర్యనారాయణ సాయికి పతకాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.

చిరుత పులి దాడిలో గేదె మృతి