
మూతపడినా భారంగా మారిన విద్యుత్ బిల్లులు
పేర్నమిట్ట ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కులో డైనమిక్ గ్రానైట్ మూతపడింది. నాగేశ్వరరావు అనే పారిశ్రామికవేత్త పార్కు ఏర్పడిన తొలినాళ్లలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వ ప్రోత్సాహం కరువై ఫ్యాక్టరీని నడపలేక మూతేశారు. ఎవరికై నా అద్దెకు గోడౌన్ల కోసం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఫ్యాక్టరీ మూసేసినా విద్యుత్ బిల్లు భారంగా మారింది. ప్రస్తుతం ఫ్యాక్టరీ నడవటం లేదు. అక్కడ వాచ్‌మెన్ ఉంటాడు. మూడు లైట్లు మాత్రమే వేస్తున్నారు. అయినా నెలకు రూ.20 వేలు విద్యుత్ బిల్లు వస్తోంది. మూడు, నాలుగు సంవత్సరాల క్రితం వాడుకున్న యూనిట్లకు గాను ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ బిల్లు బాదుడు బాదుతున్నారు. దాంతో ఫ్యాక్టరీ మూసేసినా విద్యుత్ బిల్లు భారం మోయలేకున్నారు.