
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఒంగోలు టౌన్: నగరంలోని పాత మార్కెట్ సెంటర్, పాపా రైస్ మిల్, పద్మ టవర్, ఏ వన్ ఫంక్షన్ హాలు ఎదురుగా ఉన్న పార్శిల్ సెంటర్లను పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సింధూ పోలీసు డాగ్‌తో ఆయా కార్యాలయాల్లోని అన్నీ రకాల పార్శిళ్లను పరిశీలించారు. అనుమానం వచ్చిన పార్శిళ్లను తెరచి తనిఖీలు చేయించారు. జిల్లాలో ఏఏ ప్రదేశాల నుంచి పార్శిళ్లు ఎక్కువగా వస్తున్నాయో, ఏ రకం పార్శిళ్లు వస్తున్నాయో కార్యాలయాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పార్శిళ్లను ఎన్ని రోజులు స్టోరేజి ఉంచుతారు, పార్శిల్ వివరాలను కంప్యూటర్లో నమోదు చేస్తున్నారా లేదా, వాటికి సంబంధించిన హార్ట్ డిస్క్‌లు ఎక్కడ ఉంటాయనే అనే విషయాలను ఆరా తీశారు.
చౌక డిపోల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియాన్ని అక్రమంగా తరలించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పార్శిల్ సర్వీసుల నిర్వాహకులకు ఆదేశాలిచ్చారు. ఒకవేళ ఎవరైనా రేషన్ బియ్యాన్ని తరలించినట్లు సమాచారం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను పార్శిల్ చేస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసు నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేంది లేదని స్పష్టం చేశారు. మహిళా పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్, టాస్క్‌ఫోర్స్ ఎస్సై చెంచయ్య, స్పెషల్ పార్టీ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.