
ఇద్దరు వేటగాళ్లు అరెస్టు
గిద్దలూరు రూరల్: గిద్దలూరు అటవీశాఖ రేంజ్ పరిధిలోని సండ్రపాడు బీటు అభయారణ్యంలో వన్యప్రాణులను వేటాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను గిద్దలూరు రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డి అరెస్టు చేశారు. మండలంలోని కె.బయనపల్లె గ్రామానికి చెందిన మన్నెం రంగయ్య, దిగువమెట్ట గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నాటుతుపాకీతో అభయారణ్యం ప్రాంతంలో తిరుగుతున్నట్లు మంగళవారం అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాజశేఖర్, ఎఫ్‌బీఓలు చంద్రశేఖర్‌రెడ్డి, చాంద్‌బాషలు అడవిలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో వేటాడేందుకు తుపాకీ చేతిలో ఉన్న ఇద్దరు వారి కంటపడ్డారు. అనుమానం వచ్చి వారిని అదుపులోనికి తీసుకుని విచారించగా వన్యప్రాణులను వేటాడేందుకు అడవిలోకి వచ్చినట్లు తెలిపారు. దీంతో వారి వద్ద ఉన్న నాటు తుపాకీని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.
మద్దిపాడు: మండలంలోని కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయానికి వరద నీరు ఉధృతంగా చేరుతోంది. గిద్దలూరు, వినుకొండ తదితర గుండ్లకమ్మ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో మారెళ్ల వద్ద ఉన్న ఈదర వాగు, తాళ్లూరు మండలంలోని దోర్నపు వాగు, చిలకలేర్లు ఉధృతంగా ప్రవహిస్తూ గుండ్లకమ్మ నదిలో కలుస్తున్నాయి. దీంతో బుధవారం తెల్లవారుజామున గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు వరద నీరు భారీగా చేరింది. దీంతో రిజర్వాయర్ గేట్లు ఎత్తి బయటకు విడుదల చేశారు. రిజర్వాయర్‌లోకి 12 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా ఆరు గేట్ల ద్వారా 12 వేల కూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ రామాంజనేయులు తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్ నీటి మట్టం 24 మీటర్ల వద్ద నీటిని నిల్వ ఉంచినట్లు చెప్పారు. వరద ఉధృతి కొనసాగితే ఎక్కువ గేట్లను తెరిచి నీటిని విడుదల చేస్తామన్నారు.

ఇద్దరు వేటగాళ్లు అరెస్టు