
ఎస్పీని కలిసిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు
ఒంగోలు టౌన్: సాధారణ బదిలీల్లో భాగంగా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వి.హర్షవర్థన్ రాజును జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ ఛాంబర్‌కు వచ్చిన నాయకులు ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఎంఎల్‌సీ తూమాటి మాధవరావు, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కేపీ నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు, పార్టీ పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణ, కదిరి బాబురావు, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రసిడెంట్ కనకరావు మాదిగ, రాష్ట్ర బూత్ వింగ్ ప్రసిడెంట్ కాకుమాను రాజశేఖర్ ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు.