
కార్యకర్తలే పార్టీకి బలం
ఒంగోలు సిటీ: ‘కార్యకర్తలే పార్టీకి బలం. వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. 17 మెడికల్ కళాశాలలు, సచివాలయ వ్యవస్థ, పోర్టులు వంటి వాటితో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారన్నారు. పార్టీని ఎలా పటిష్టం చేసుకోవాలో వివరించారు.
కార్యకర్తలకు అండగా ఉండేందుకే
డిజిటల్ బుక్
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసుకోవడంలో కార్యకర్తలకే కీలకమన్నారు. ఏ పార్టీకై నా జెండా మోసే నాయకులు, కార్యకర్తలు లేకపోతే పార్టీ నిలబడదని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుల తీరుతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని, వారిపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. అందుకే వారికి అండగా ఉండేందుకు డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు వారి సమస్యలను డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన ప్రజాప్రతినిధులు, అధికారులపై భవిష్యత్‌లో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక చిన్న స్థాయి ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎదిగానంటే మీ అందరి ఆదరణ అభిమానమేనన్నారు. కార్యకర్త పడే కష్టాలు, ప్రజాప్రతినిధులు పడే కష్టాలు తెలుసని, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు భవిష్యత్‌లో పార్టీ అధికారంలోకి వచ్చి వెంటనే గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలను మర్చిపోమన్నారు. ప్రజా సమస్యలపై చేస్తున్న కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. కష్టపడి పనిచేసిన వారికి రానున్న రోజుల్లో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు మాట్లాడుతూ 75 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని గత ఐదేళ్లలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసి చూపించారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగించాలని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నాయకులు, కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని, జిల్లాలోని అన్ని స్థానాలు కై వసం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మనందరెడ్డి, మాజీ మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగ నాగార్జున, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు, గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి కె.నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైజాగ్ పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబురావు, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.శివశంకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వజ్రా భాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి కసుకుర్తి ఆదెన్న, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, జిల్లా అఫిలియేటెడ్ వింగ్ ఇన్‌చార్జి వెంకటప్పరెడ్డి, రాష్ట్ర ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సీహెచ్ విజయభాస్కరరెడ్డి, అషోది యలమందారెడ్డి, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
పార్టీని బలోపేతం చేయడంలో వారే కీలకం
వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు
బూచేపల్లి అధ్యక్షతన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం

కార్యకర్తలే పార్టీకి బలం