
వైద్యం అందని ద్రాక్ష
బాబు పీపీపీ..
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పక్కన జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యేలు బూచేపల్లి, తాటిపర్తి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కేపీ, దద్దాల, చుండూరి తదితరులు
మార్కాపురం/మార్కాపురం టౌన్: మెడికల్ కాలేజీని ప్రైవేటు పబ్లిక్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించడం వలన పేద ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని, వైద్యం అందని ద్రాక్షలా మారుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్ సీపీ మార్కాపురం, గిద్దలూరు ఇన్‌చార్జ్‌లు అన్నా రాంబాబు, కేపీ నాగార్జునరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం మండలం రాయవరం వద్ద చేపట్టిన మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్మిస్తున్నందుకు నిరసనగా శుక్రవారం వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. పశ్చిమ ప్రజల ఆశాదీపంగా ఉన్న మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేయడం తగదని వారు నినదించారు. ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు నాణ్యమైన వైద్యం, వైద్యవిద్య ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో మెడికల్ కళాశాలలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారని, వీటిలో అనేక మెడికల్ కళాశాలలు దాదాపు పూర్తయ్యే దశలో ఉండగా కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్మించాలనుకోవడం దుర్మార్గపు చర్య అన్నారు. పశ్చిమ ప్రకాశానికి మార్కాపురం మెడికల్ కాలేజీ వరమని అన్నారు. ఇలాంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వం చేయడం తగదన్నారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఒకేసారి 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి మంచిపేరు వస్తుందనే అక్కసుతో చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. సీట్లను అమ్ముకోవాలనే ఉద్దేశంతోనే ప్రైవేటుపరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలలను నిర్మించాలని బూచేపల్లి డిమాండ్ చేశారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం ఉద్యమం చేపడతామని అన్నారు.
రూ.కోట్ల విలువైన ఆస్తులు ప్రైవేటుపరం:
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రాణదాత వైఎస్ జగన్ అన్నారు. 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటువారికి ధారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తోందన్నారు. ఒక్కొక్క మెడికల్ కళాశాల భూమి విలువ దాదాపు రూ.300 కోట్లు ఉంటుందని, ప్రభుత్వ ఆస్థిని ఎలా ప్రైవేటీకరణ చేస్తారని ప్రశ్నించారు. ఇంత వరకూ వెలుగొండను పూర్తిచేయలేదని ఆయన విమర్శించారు.
ప్రభుత్వ వైఖరి మారకుంటే ఆమరణ దీక్ష
మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు మాట్లాడుతూ నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ పరంగా మెడికల్ కళాశాలను కడితే వాటిని పూర్తిచేసేందుకు ప్రైవేటుపరం చేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే ధోరణితో ముందుకెళితే తాను ఆమరణ దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ కేపీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ దాదాపు పూర్తికావచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో కట్టాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఈ విధానం వలన వైద్య విద్య పేద ప్రజలకు అందదని, ఉచిత వైద్యం కూడా అందదన్నారు. మళ్లీ ఉచిత వైద్యం కోసం ఒంగోలు, గుంటూరు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తే 150 సీట్లు అర్హులైన విద్యార్థులందరికీ ఉచితంగా దక్కుతాయని, పేదలు ఓపీ ఫీజు చెల్లించకుండానే ఉచిత వైద్యం పొందవచ్చని చెప్పారు. తక్షణమే పీపీపీ విధానాన్ని రద్దుచేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీని కట్టాలని డిమాండ్ చేశారు. తాను 2019లో వైఎస్ జగన్ వద్దకు వెళ్లి మెడికల్ కళాశాల ప్రాధాన్యతను వివరించగానే మంజూరు చేశారని, ఈ ప్రాంత ప్రజలకు ఇదొక వరం లాంటిదన్నారు.
కార్యక్రమంలో జెడ్పీచైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, కసుకుర్తి ఆదెన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వైవీరావు, ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరే షన్ మాజీ చైర్మన్ డాక్టర్ షంషేర్ ఆలీబేగ్, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ వైఎం ప్రసాద్‌రెడ్డి, జిల్లా వైఎస్సార్ సీపీ యూత్ అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ మార్కాపురం పట్టణ, మండల, తర్లుపాడు, పొదిలి, కొనకనమిట్ల అధ్యక్షులు సలీమ్, చెంచిరెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, గుజ్జుల సంజీవరెడ్డి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, ఎంపీపీలు లక్ష్మీదేవీ కృష్ణారెడ్డి, భూలక్ష్మి రామసుబ్బారెడ్డి, మురళీకృష్ణ యాదవ్, జెడ్పీటీసీలు నారు బాపన్‌రెడ్డి, అక్కిదాసరి ఏడుకొండలు పాల్గొన్నారు. వీరితోపాటు అంగన్‌వాడీ మహిళా కార్యదర్శి ఉడుముల వరలక్ష్మమ్మ, గుజ్జుల రమణారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి జీ శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి విభాగం కన్వీనరు ఏలూరి సంజీవరెడ్డి, గాయం శ్రీనివాసరెడ్డి, బీ బాలకృష్ణారెడ్డి, ఉడుముల కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, పెద్దారవీడు, పెద్దదోర్నాల పార్టీ కన్వీనర్లు డీ వెంకటేశ్వర్లు, ఎస్ పోలిరెడ్డి, కృష్ణారెడ్డి, జీవీ రమణారెడ్డి, ముసలారెడ్డి, ఎంపీపీలు కిరణ్‌గౌడ్, ఆళ్ల ఆంజనేయరెడ్డి, బెజవాడ చిన్న గురవయ్య, జెడ్పీటీసీ చలమారెడ్డి, రాష్ట్ర మహిళా ప్రదాన కార్యదర్శి ఉడుముల అరుణ, వై వెంకటేశ్వరరెడ్డి, అరుణాబాయి, జానకిరఘు, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మాజీద్, రాములు పాల్గొనగా గిద్దలూరు నియోజకవర్గం నుంచి కొమరోలు జెడ్పీటీసీ వెంకట నాయుడు, మండల కన్వీనర్ రవికుమార్, గిద్దలూరు మాజీ ఎంపీపీ వంశీధర్‌రెడ్డి, మండల కన్వీనర్ ఓబులరావు, బేస్తవారిపేట ఎంపీపీ వేగినాటి ఓసూరారెడ్డి, రాజయ్య, మండల కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, వెన్న భాస్కర్‌రెడ్డి, స్టేట్ మైనార్టీ సెక్రటరీ గఫార్‌ఆలీఖాన్, అర్ధవీడు ఎంపీపీ వెంకటరావు, మండల కన్వీనరు రంగారెడ్డి, రవికుమార్ యాదవ్, కనిగిరి నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు మడతల కస్తూరిరెడ్డి, తిరుపతిరెడ్డి, గంగసాని లక్ష్మీరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, తమ్మినేని సుజాతరెడ్డి, హుస్సేన్ రెడ్డి, వై శ్రీకాంత్‌రెడ్డి, పులి రమేష్‌రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీ భవనాల వద్ద సెల్ఫీ తీసుకుంటున్న తాటిపర్తి, బూచేపల్లి, వెంకాయమ్మ, అన్నా రాంబాబు, కేపీ నాగార్జునరెడ్డి, చుండూరి రవిబాబు తదితరులు
మెడికల్ కాలేజీ భవనాలను చూపుతున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

వైద్యం అందని ద్రాక్ష