
గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలి
● జేసీ గోపాలకృష్ణ
ఒంగోలు వన్‌టౌన్: జిల్లా గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జేసీ గోపాల కృష్ణ రోణంకి అన్నారు. జేసీ చాంబర్‌లో గ్రంథాలయ సంస్థ అభివృద్ధి సమావేశాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. గ్రంథాలయ సంస్థ సెస్ బకాయిలను సంస్థకు చెల్లించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా ఆడిట్ అధికారి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్‌లు, ఏపీఐఐసీ కమిషనర్, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.