
వైద్య విద్యపై కూటమి దుష్ట పన్నాగం
యర్రగొండపాలెం:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పదవీ కాలంలో పేద విద్యార్థులు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేశారని, వాటిలో కొన్ని నిర్మాణం పూర్తయి వైద్య విద్యార్థుల అడ్మిషన్లు కూడా జరిగాయని, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేయడం దుర్మార్గమన్నారు. జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమంలో భాగంగా మార్కాపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల వద్దకు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయం వద్దకు చేరిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులను ఉద్ధేశించి ఆయన మాట్లాడారు. పొలిటికల్ ఇండస్ట్రీలో 40 ఏళ్లు అనుభవం ఉందని చెప్పుకుంటున్న కూటమి నాయకుడు, సీఎం నారా చంద్రబాబునాయుడు ఒక్క మెడికల్ కాలేజీని మంజూరు చేయించలేకపోయాడని, రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలలను తానే ఏర్పాటు చేయించానని అబద్ధపు మాటలు చెబుతున్నాడని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం చేపట్టే ప్రతి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుండటంతో కూటమి ప్రభుత్వ నాయకులకు వణుకుపుట్టి అధికారంలో ఉన్నామన్న మదంతో పోలీసులను అడ్డుపెట్టుకొని ఆ కార్యక్రమాలను విచ్ఛిన్నం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు. శ్రీఅదరం బెదరం – ప్రజల పక్షాన నిలిచే జగనన్న వెంటే తామందరంశ్రీ అంటూ భారీగా తరలివస్తున్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ కూడలి ప్రాంతమైన పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు వద్దకు 5 మండలాల వైఎస్సార్ సీపీ శ్రేణులు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మార్కాపురం మెడికల్ కాలేజ్ వద్దకు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమాల్లో ఎంపీపీలు దొంతా కిరణ్‌గౌడ్, ఆళ్ల సుబ్బమ్మ ఆంజనేయరెడ్డి, బెజవాడ పెద్ద గురవయ్య, జెడ్పీటీసీలు చేదూరి విజయభాస్కర్, యేర్వ చలమారెడ్డి, ఆర్.వాగ్యా నాయక్, ఆయా మండలాల సమన్వయ కర్తలు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, దోమకాళ్ల వెంకటేశ్వర్లు, సింగారెడ్డి పోలిరెడ్డి, ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్.మజీద్, షేక్.నూర్‌ఆహమ్మద్, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి, ఇంటిలెక్చువల్ జిల్లా అధ్యక్షుడు అంగిరేకుల ఆదినారాయణ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ఉడుముల అరుణమ్మ, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎల్.రాములు, జిల్లా కార్యదర్శి ఆర్.అరుణమ్మ, ఆదిత్య విద్యా సంస్థల అధినేత సూరె రమేష్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పి.రాములు నాయక్, మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎం.ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు.
జగనన్న ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు
చంద్రబాబు వాటిని తన అనుచరులకు కారుచౌకగా అమ్మేస్తున్నారు
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజం

వైద్య విద్యపై కూటమి దుష్ట పన్నాగం