
టైరు పేలి కారు బోల్తా
పెద్దదోర్నాల: వేగంగా ప్రయాణిస్తున్న కారు టైరు బరస్ట్ కావడంతో అదుపుతప్పి రోడ్డు మార్జిన్‌లోని గుంతలో బోల్తా పడింది. ఈ సంఘటన గురువారం పెద్దోర్నాల మండల పరిధిలో శ్రీశైలం రహదారిలోని ఈద్గా వద్ద చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. పల్నాడు జిల్లా పెట్లూరివారిపల్లెకు చెందిన శివరామయ్య, ఆయన భార్య పద్మ, కుమారుడు రేవంత్, కుమార్తె రోహిణి దైవదర్శనం నిమిత్తం కారులో శ్రీశైలం బయలుదేరారు. పెద్దదోర్నాలలోని ఈద్గా వద్దకు చేరుకోగానే టైరు బరస్ట్ కావడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న 10 అడుగుల లోతు గుంతలో పడింది. ఈ ప్రమాదంలో శివరామయ్య, ఆయన భార్య పద్మ, కుమారుడు రేవంత్, కుమార్తె రోహిణికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో తొలుత స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం నర్సారావుపేటకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దదోర్నా–శ్రీశైలం రహదారిలో ప్రమాదం
పల్నాడు జిల్లా పెట్లూరివారిపల్లె
వాసులకు తీవ్ర గాయాలు

టైరు పేలి కారు బోల్తా

టైరు పేలి కారు బోల్తా