
హైవే మార్జిన్‌లోకి దూసుకెళ్లిన లారీ
మద్దిపాడు: జాతీయ రహదారిపై గుట్టుగా తరలిపోతున్న బియ్యం అక్రమ రవాణాను లారీ డ్రైవర్ నిద్రమత్తు రట్టు చేసింది. బియ్యం లోడ్‌తో వినుకొండ నుంచి చైన్నె వైపు వెళ్తున్న 14 చక్రాల లారీ బుధవారం మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి ఫ్లయ్‌ఓవర్ సమీపంలో హైవే మార్జిన్‌లోకి దూసుకెళ్లింది. రోడ్డు పక్కన 2 విద్యుత్ స్తంభాలను తాకుతూ సుమారు 20 మీట్లర్ల దూరంలోని గదులను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ క్రమంలో లారీ ముందు భాగం నుజ్జునుజ్జయింది. స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీలో తరలిస్తున్నది పీడీఎస్ బియ్యంగా గుర్తించి సీజ్ చేశారు. లారీలో 25 కేజీల పరిమాణం గల 1200 బ్యాగ్‌లు ఉన్నాయని విజిలెన్స్ అధికారులు తెలిపారు.
బోల్తా పడిన లారీలో 30 టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు