
పెద్దనల్లకాల్వలో వైద్య శిబిరం
కంభం: మండలంలోని పెద్దనల్లకాల్వ గ్రామంలో జ్వరాలు అధికంగా ప్రబలిన వైనంపై బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పంచాయతీ, వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించారు. బుధవారం గ్రామంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. జ్వరాలతో బాధపడుతున్న పిల్లల గృహాలకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తురిమెళ్ల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ రమేష్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎంపీడీఓ వీరభద్రాచారి, డిప్యూటీ ఎంపీడీఓ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పెద్దనల్లకాల్వలో వైద్య శిబిరం