
బాల్య వివాహం నేరం
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్
ఒంగోలు: బాల్య వివాహం అనేది చట్టప్రకారం నేరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు లేని దిశగా సమాజం ముందుకు పోవాలన్నారు. బాల్య వివాహాల సమాచారం తెలిస్తే వెంటనే అధికారులకు తెలియజేసి వాటిని అడ్డుకోవాలని సూచించారు. జిల్లాస్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామన్నారు. జువైనల్ బోర్డు లీగల్ ఆఫీసర్ రత్నప్రసాద్ మాట్లాడుతూ సీ్త్రశిశు సంక్షేమ శాఖ తరఫున ప్రతి ఒక్క అంగన్‌వాడీ కార్యకర్త క్షేత్రస్థాయిలో బాల్య వివాహాల వివరాలు సేకరించి సంబంధిత వర్గాలకు తెలియజేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వివిధ మతాలకు చెందిన పూజారులు, పాస్టర్లు, ముల్లాలు పాల్గొన్నారు.