
కలెక్టర్‌ను కలిసిన బూచేపల్లి
ఒంగోలు సబర్బన్: జిల్లా కలెక్టర్ పి.రాజాబాబును జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిలు కలెక్టర్ ఛాంబర్‌లో బుధవారం కలిసి అభినందించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం జిల్లాలోని పరిస్థితులపై కొంతసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.