
ఆశలు కరిగి!
ఆశ నిరాశల మధ్య ఉప్పు రైతులు ఉమ్మడి జిల్లాలో సుమారు 4 వేల ఎకరాల్లో సాగు వాతావరణ మార్పులతో తగ్గిన దిగుబడి ధర ఉన్నా భారీగా పడిపోయిన దిగుబడి అడపా దడపా వర్షాలతో తగ్గిన నాణ్యమైన ఉప్పు దిగుబడి నాణ్యతను బట్టి 100 కేజీల ఉప్పు ధర రూ.310 నుంచి రూ.400 ఈ సంవత్సరం కష్టాలు తప్పవంటున్న ఉప్పు రైతులు
ఉప్పు రైతు బతుకు మాత్రం చప్పగా తయారైంది. తరతరాలుగా ఈ పంటనే నమ్ముకున్న వారి జీవితాలు కష్టాల కడలిలో కరిగిపోతున్నాయి. రెండేళ్లుగా ప్రతికూల పరిస్థితుల్లో సాగు భారంగా మారింది. పంట ఉంటే ధర ఉండదు. ధర ఉంటే దిగుబడి లేక రైతులు నష్టాలపాలవుతున్నారు. ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడి భారీగా పడిపోయింది. ఎకరాకు 400 బస్తాల మేర దిగుబడి తగ్గిపోయింది. ఫలితంగా ధర ఉన్నా పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు దళారుల దోపిడీ వీరిపాలిట శాపంగా మారింది.
నాణ్యత తరిగి..
ఉప్పు కొఠారుల్లో తయారైన ఉప్పు

ఆశలు కరిగి!