
రాష్ట్రమంతటా అన్నదాత ఆక్రందనలే
రైతులను మరచిన బాబు సర్కార్ కూటమి పాలనలో మహిళలకు భద్రత కరువైంది మాజీ మంత్రి మేరుగు నాగార్జున
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అన్నదాతకు ఆక్రందనలే మిగిలాయని, రైతులను కూటమి సర్కార్ మరిచిపోయిందని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని బొడ్డువానిపాలెం, మద్దులూరు గ్రామాల్లో మంగళవారం బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. మండలపార్టీ అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేరుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నదాతలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని, రైతులకు ఎటువంటి కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. ఎరువుల కొరత అధికంగా ఉందని, పండించిన పంటలకు మద్దతు ధర దక్కడం లేదని ధ్వజమెత్తారు. కూటమి దౌర్జన్యాలకు చరమగీతం పాడాలంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాలన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బీ విజయ నాగేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, దుంపా ఎలమందరెడ్డి, ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి, ఎస్‌ఎన్‌పాడు మహిళా అధ్యక్షురాలు సీతమ్మ, సర్పంచ్‌లు టీ వెంకటరెడ్డి, మైనం శైలజ అమరనాథ్, ఎంపీటీసీలు నల్లూరి రాధ భాస్కరరావు, కామేపల్లి సుబ్బయ్య, మాదాల వెంకటరావు, కే శ్రీమన్నారాయణ, తేళ్ల అనిల్, జంగాల కుమారి, ఎన్ సుబ్బారావు, పీ వెంకటరావు, ఎం రమణారెడ్డి, ఏ రమణారెడ్డి, కే దేవేందర్, కోటి, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.