
కుమార్తె మృతిపై తల్లి అనుమానం
కంభం: స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో అనారోగ్యంతో చికిత్సపొందుతూ తెలుగు వీధికి చెందిన మోదులార్ సుమతి(35) మృతి చెందింది. కుమార్తె మృతిపై అనుమానం ఉందని తల్లి సుశీల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్లున్నట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు. మృతురాలికి భర్త రాముడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మార్కాపురం: మార్కాపురం అటవీ శాఖ నూతన డిప్యూటీ డైరెక్టర్ గా అబ్దుల్ రావుఫ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్ డీఎఫ్‌ఓగా పనిచేస్తూ బదిలీపై మార్కాపురం అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన సందీప్ కృపాకర్ అటవీ శాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఈయనను డీఆర్‌ఓ పిచ్చిరెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగరాజుగౌడ్, సిబ్బంది కలిసి అభినందించారు.
ఒంగోలు టౌన్: ౖరెల్వే స్టేషన్లలో సెల్‌ఫోన్లను దొంగలిస్తున్న వ్యక్తిని జీఆర్‌పీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రైల్వే స్టేషన్‌లోని జీఆర్పీ పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీఆర్పీ సీఐ షేక్ మౌలా షరీఫ్ నిందితుడి వివరాలు వెల్లడించారు. వేటపాలెం గ్రామానికి చెందిన ఆసాది చంగల్‌రావు గత కొంతకాలంగా సెల్‌ఫోన్లను దొంగలిస్తున్నాడు. రైలు ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను తస్కరిస్తున్నాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జీఆర్పీ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. శుక్రవారం చంగల్‌రావును అదపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ.1.49 లక్షల విలువైన 12 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సీఐ కొండయ్య, జీఆర్పీ ఎస్సై కె.మధుసూదన్‌రావు పాల్గొన్నారు.
కొత్తపట్నం: మండలంలోని వజ్జిరెడ్డిపాలెం గ్రామ పరిధిలో ఇద్దరు బాలికలపై పెదనాన్న వరుసయ్యే దొడ్ల వీరారెడ్డి అనే వ్యక్తి లైంగికదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదైంది. శుక్రవారం ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్ వజ్జిరెడ్డిపాలెం గ్రామంలో విచారణ చేపట్టారు. నిందితుడు వీరారెడ్డి ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యులను, స్థానికులను విచారించారు. అదే విధంగా బాలికల తల్లిదండ్రులను పరామర్శించి చట్టపరంగా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. విచారణ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పిస్తామని డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట కొత్తపట్నం ఎస్సై వేముల సుధాకర్‌బాబు, సిబ్బంది ఉన్నారు.
చీమకుర్తి రూరల్: మండలంలోని గోనుగుంట–గుండువారి లక్ష్మీపురం గ్రామాల మధ్య కారుమంచి సాగర్ కాలువ పక్కన పొలంలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, సిమెంట్ రంగు నెక్ టీషర్ట్, లేత నీలం రంగు షార్ట్ ధరించి ఉన్నాడని సీఐ సుబ్బారావు తెలిపారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు 9121104179, 9121102113ని సంప్రదించాలని సూచించారు.

కుమార్తె మృతిపై తల్లి అనుమానం

కుమార్తె మృతిపై తల్లి అనుమానం

కుమార్తె మృతిపై తల్లి అనుమానం