
ఉప్పలపాడులో టీడీపీ నేతల దుశ్చర్య
పొదిలి రూరల్: అధికారం చేతిలో ఉందన్న అహంకారంతో టీడీపీ కార్యకర్తలు దుశ్చర్యకు ఒడిగట్టారు. వైఎస్సార్ సీపీ శ్రేణులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ అక్రమ కేసులు బనాయించే కుట్రలకు తెరదీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పొదిలి మండలంలోని ఉప్పలపాడులో సర్పంచ్ గుంటూరి ఏసోబు, పంచాయతీ కార్యదర్శి శేషగిరి ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేస్తున్నారు. జేసీబీతో ఆక్రమణలు తొలగించి, కాలువ పుడీకతీత పనులు చేసే క్రమంలో అప్పటికే శిథిలావస్థలో ఉన్న టీడీపీ జెండా దిమ్మె పగిలిపోయింది. స్థానిక టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగడంతో పొరపాటున తగిలిందని చెప్పి హుటాహుటిన నూతన దిమ్మె నిర్మించారు. అయితే దీనికి టీడీపీ నేత, ఉప్పలపాడు సొసైటీ అధ్యక్షుడు ఉలవా గోపి రాజకీయాలు ఆపాదించాడు. మద్యం మత్తులో ఉన్న టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పడంతో కొమ్ము లక్ష్మీనారాయణ, గుంటూరి బ్రహ్మయ్యతోపాటు మరికొందరు కలిసి గురువారం అర్ధరాత్రి వైఎస్సార్ సీపీ జెండా దిమ్మెను గడ్డపారలతో ధ్వంసం చేశారు. ఇదేం అన్యాయమని ప్రశ్నించిన వారిని శ్రీపగలగొడతాం. ఏం చేసుకుంటారో చేసుకోండిశ్రీ అంటూ వెళ్లిపోయారు. దీనిపై శుక్రవారం ఉదయం గ్రామంలో ఇరు పార్టీల నేతల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీకి చెందిన పెద్దలు కొందరు తమవాళ్లదే తప్పని అంగీకరించడంతోపాటు వైఎస్సార్ సీపీ జెండా దిమ్మెను కట్టిస్తామని చెప్పడంతో సమస్య సద్దుమనిగింది.
వైఎస్సార్ సీపీ జెండా దిమ్మె ధ్వంసం

ఉప్పలపాడులో టీడీపీ నేతల దుశ్చర్య