
అధిక ఫీజు వసూలుపై విద్యార్థుల ఆందోళన
మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని గౌతమి డిగ్రీ కళాశాల యాజమాన్యం తమ వద్ద అధికంగా పరీక్ష ఫీజు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. శుక్రవారం కళాశాల నుంచి మార్కాపురం సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. యూనివర్శిటీ నిర్ణయించిన విధంగా పరీక్ష ఫీజు ఒకే విధంగా ఉండాలని, కళాశాలలో మాత్రం అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మిగిలిన ఫీజులు కూడా చెల్లించాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంటుతో తమకు సంబంధం లేదని, కళాశాల సిబ్బంది చెప్పారని, దీంతో 3, 5వ సెమిస్టర్ ఫీజులతోపాటు కళాశాల పీజు కూడా కట్టాలని బలవంతం చేస్తున్నారన్నారు. 3వ సెమిస్టర్ ఫీజు ప్రభుత్వం నుంచి జమ అయినప్పటికీ తమ వద్ద మళ్లీ ఫీజులు వసూలు చేస్తున్నారని, దీంతో తాము ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
సబ్‌కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేత