
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
ఒంగోలు టౌన్: ఒంగోలు శ్రీనగర్ కాలనీ గణేశ్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా పోలీసులతో జరిగిన తోపులాటకు సంబంధించి అక్రమ కేసులో అరెస్టయి జిల్లా జైల్లో ఉన్న ఆరుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఆ పార్టీ నేతలు శుక్రవారం పరామర్శించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు తదితరులు శుక్రవారం ములాఖత్ ద్వారా జైలులో ఉన్న పార్టీ కార్యకర్తలను కలిసి మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జైలు వెలుపల ఉన్న వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, చీమకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావుపాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి, తాటిపర్తి, ఒంగోలు ఇన్‌చార్జి చుండూరి
జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న కార్యకర్తలకు పరామర్శ
బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన బత్తుల బ్రహ్మానందారెడ్డి తదితరులు