గుర్తుతెలియని వాహనం ఢీకొని... | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీకొని...

Sep 7 2025 7:16 AM | Updated on Sep 7 2025 6:11 PM

-

పాఠశాలకు అని చెప్పి.. రైలులో వెళ్లిన రెండో తరగతి విద్యార్థి పెళ్లికి నిరాకరించారని యువకుడు ఆత్మహత్య వాహనం ఢీకొని ఎనిమిది గేదెలు మృతి రోడ్డు ప్రమాదంలోఇద్దరికి గాయాలు

సీఎస్‌ పురం (పామూరు): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎనిమిది గేదెలు మృతిచెందిన సంఘటన శనివారం వేకువజామున 167బీ జాతీయ రహదారిపై సీఎస్‌ పురం మండలంలోని కోవిలంపాడు – కంభంపాడు గ్రామాల మధ్య చోటుచేసుకుంది. వాటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుంది. అయితే, ఈ సంఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇంకా ఫిర్యాదు అందలేదు.

మార్కాపురం: పాఠశాలకు వెళ్తున్నానని చెప్పిన రెండో తరగతి విద్యార్థి నేరుగా రైల్వేస్టేషన్‌కు చేరుకుని రైలు ఎక్కి వెళ్లిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. మార్కాపురం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న బాలుడు శనివారం మధ్యాహ్నం భోజనానికి పాఠశాల నుంచి ఇంటికొచ్చాడు. ఇంట్లో భోజనం చేసిన అనంతరం పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి పాఠశాలకు వెళ్లకుండా మార్కాపురం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో వచ్చిన రైలు ఎక్కి గిద్దలూరు రైల్వేస్టేషన్‌లో దిగాడు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న బాలుడిని చూసిన రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వివరాలు తెలుసుకుని మార్కాపురంలోని బాలుడి తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో వారు గిద్దలూరు వెళ్లి బాలుడిని తీసుకొచ్చారు.

కొమరోలు: పెళ్లికి నిరాకరించారనే కారణంతో క్షణికావేశంలో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కొమరోలు మండలంలోని గుండ్రెడ్డిపల్లె గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాలదాగి పెద్దనరసింహులు (24) తల్లిదండ్రులు అతని మేనమామ కూతురినిచ్చి పెళ్లిచేయాలనే ఉద్దేశంతో వారింటికి వెళ్లి అడిగారు. కానీ, వారు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన పెద్దనరసింహులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు దుప్పటితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై నాగరాజు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేతికందివచ్చిన కుమారుడి మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

బేస్తవారిపేట: జాతీయ రహదారిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌ సమీపంలో శనివారం ఎదురెదురుగా రెండు మోటార్‌ సైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. బేస్తవారిపేటలోని టైలర్స్‌కాలనీకి చెందిన కత్తి వేణుగోపాల్‌ పిల్లలను స్థానిక జంక్షన్‌లోని స్కూల్‌లో వదిలిపెట్టి బేస్తవారిపేట వైపునకు స్కూటీపై వెళ్తున్నాడు. ఒందుట్లకు చెందిన నాగూరు మీరావలి జంక్షన్‌వైపు వెళ్తుండగా, ఈ రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వేణుగోపాల్‌ తల కు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. నాగూర్‌మీరావలి స్వల్పంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్సై రవీంద్రారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వేణుగోపాల్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీస్‌ వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు గిద్దలూరు తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement