
ఉపాధ్యాయునిపై విచారణ
మద్దిపాడు: మండలంలోని వెల్లంపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గోపనబోయిన రవికుమార్‌పై డిప్యూటీ డీఈఓ చంద్రమౌళేశ్వరరావు, జిల్లా బాలికల సంరక్షణ అధికారి దినేష్‌కుమార్, ఇతర ిసిబ్బంది శనివారం విచారణ చేపట్టారు. మద్దిపాడు కడియాల యానాదయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులను విచారించారు. బంగారు బాల్యం కార్యక్రమంలో వెల్లంపల్లి ప్రాథమిక పాఠశాలలో చదివిన విద్యార్థులు కొందరు గోపనబోయిన రవికుమార్ తీరుపై అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో అతనిపై విచారణ నిర్వహించడానికి విద్యార్థినుల తల్లిదండ్రులను గోప్యంగా పిలిపించారు. ఐసీడీఎస్ మద్దిపాడు ప్రాజెక్టు సూపర్‌వైజర్లు ఆయా విద్యార్థినులను విచారించారు. విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. విచారణలో ఒంగోలు ఎంఈఓ కిషోర్‌కుమార్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు నాగరాజ, పద్మ తదితరులు పాల్గొన్నారు.