
అన్నదాత పోరు వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన తలపెట్టిన అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ పోరు వాల్‌పోస్టర్‌ను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ శనివారం నియోజకవర్గానికి చెందిన ఐటీ వింగ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. రైతుల పక్షన నిలబడి పోరుకు పిలుపునిచ్చిన జగనన్నకు తమ అండదండలు ఉంటాయని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి, నియోజకవర్గ విభాగం అధ్యక్షుడు దుద్యాల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు అల్లు సదాశివారెడ్డి, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, పెద్దారవీడు, పెద్దదోర్నాల మండలాల ఐటీ వింగ్ అధ్యక్షులు కందుల వెంకటసుబ్బారెడ్డి, పతంగి అంజిరెడ్డి, కొల్లి నాగేశ్వరరెడ్డి, మూల హర్షవర్ధన్‌రెడ్డి, వెన్నా కాశీశ్వరరెడ్డి పాల్గొన్నారు.