
కార్పొరేట్లకు అప్పగిస్తే నష్టమే
మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విచారకరం. ప్రభుత్వ నిర్వహణలో ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. అదే కార్పొరేట్లకు అప్పగించడం వలన సామాన్య నిరుపేద ప్రజలకు వైద్య సేవలు భారమవుతాయి. ప్రభుత్వ వైద్య కళాశాలగా కొనసాగితే మెరిట్ విద్యార్థులకు మాత్రమే సీట్లు వస్తాయి. లేకపోతే మేనేజ్‌మెంట్ కోటా పేరుతో సీట్లను అమ్ముకునే అవకాశాలు ఉంటాయి. ఎటు చూసినా ప్రైవేటు కళాశాల వలన ప్రజలకు నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు.
– డా.అజయ్ కుమార్ రెడ్డి, జీజీహెచ్, ఒంగోలు
డాక్టర్ కలను నాశనం చేసిన బాబు
ఎంబీబీఎస్ చదివి గొప్ప డాక్టర్లు అవ్వాలనే పేద విద్యార్థుల కలలను సీఎం చంద్రబాబు నాశనం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య విద్యను నిర్వీర్యం చేసింది. విద్యా, వైద్యం అందరికీ అందాలనే లక్ష్యంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది. వైద్య పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య తోపాటు, పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించాలన్న లక్ష్యంగా కళాశాల నిర్మాణాలను వేగవంతం చేశారు. అయితే చంద్రబాబు వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం సరికాదు. కొన్ని వేల మంది విద్యార్థులు డాక్టర్ కావాలనే ఆశలు ఆడియాశలయ్యాయి.
– నందకిషోర్, వైఎస్సార్ సీపీ డాక్టర్స్ వింగ్ జిల్లా అధ్యక్షుడు

కార్పొరేట్లకు అప్పగిస్తే నష్టమే