
గురువులకు గుర్తింపు
నలుగురికి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా 53 మంది ఎంపిక ఈనెల 5 ఉపాధ్యాయ దినోత్సవం రోజు అవార్డుల ప్రదానం
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా 53 మంది
ఒంగోలు సిటీ:
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబరు 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం అందించే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లా నుంచి నలుగురు ఉపాధ్యాయులు, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా 53 మంది ఎంపికై నట్లు డీఈఓ కిరణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తర్లుపాడు జెడ్పీ హైస్కూల్లో గ్రేడ్–2 హెచ్‌ఎంగా పనిచేస్తున్న ముత్తోజు సుధాకర్, వెలిగండ్ల మండలం మొగళ్లూరు జెడ్పీ హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న బి.సరోజనిదేవి, పీసీపల్లి జెడ్పీ హైస్కూల్ సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న జీ ఈశ్వరమ్మ, మర్రిపూడి మండలం తంగెళ్ల జెడ్పీ హైస్కూల్ హిందీ టీచర్‌గా పనిచేస్తున్న గుంటగాని భాస్కరరావు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికై నట్లు తెలిపారు. ఎంపికై న ఉపాధ్యాయులకు ఈనెల 5వ తేదీ విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ దినోత్సవంలో అవార్డులు అందజేస్తారన్నారు.
తరగతి గది రూపు మార్చి...
తర్లుపాడు: రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై న తర్లుపాడు జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం ఎం.సుధాకర్ మూడేళ్లుగా అక్కడ పనిచేస్తున్నారు. విద్యార్థులకు ఉత్తమ విద్యనందించడంలో ముందున్నారు. పూర్వ విద్యార్థుల ద్వారా రూ.50 లక్షలకుపైగా విరాళాలు సేకరించి తాను పనిచేస్తున్న పాఠశాలలో తరగతి గదుల ఆధునికీకరణ, వంటగది, తరగతి గదిలో బెంచీల ఏర్పాటు, పెయింటింగ్‌తో పాఠశాల రూపురేఖలు మార్చేశారు. కొన్నేళ్లుగా ఆ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై న సందర్భంగా సుధాకర్‌కు డివిజన్‌లోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రయోగాత్మకంగా విద్యాబోధన
వెలిగండ్ల, (కనిగిరిరూరల్): వెలిగండ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన భౌతిక రసాయన శాస్త్రాల ఉపాధ్యాయురాలు బీ సరోజనీదేవి రాష్ట్ర ఉత్తమ టీచర్ అవార్డుకు ఎంపికయ్యారు. సరోజనీదేవి మొగళ్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఇటీవల జరిగిన బదిలీల్లో వెలిగండ్ల పాఠశాలకు వెళ్లారు. రసాయన శాస్త్రంలో ప్రయోగాత్మకంగా విద్యాబోధన, సైన్స్ ప్రయోగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఆమె ముందున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై న సరోజనీదేవిని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందించారు.
డ్రాప్‌అవుట్‌లను బడిబాట పట్టించి..
మర్రిపూడి: మండలంలోని తంగెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఏ హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గుంటగాని భాస్కర్‌రావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. డ్రాప్‌అవుట్‌లను నిరోధించడం, విద్యార్థుల రోల్ పెంచడం, పదో తరగతి విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపి ఉత్తమ ఫలితాలు రాబట్టడంలో ఆయన ముందున్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికై న సందర్భంగా ఆయనకు సహచర ఉపాధ్యాయులు, ఎంఈవో రంగయ్య అభినందనలు తెలిపారు.
పేద విద్యార్థుల ఉన్నత చదువులకు చేయూత
పీసీపల్లి: మండల పరిధిలోని పీసీపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో సోషల్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గడ్డం ఈశ్వరి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. దాతల సహకారంతో తాను పనిచేసే పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం, పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివించేందుకు చేయూతనందించడం, తాను తొలిసారి ఉపాధ్యాయురాలిగా చేరిన అంక భూపాలపురంలో ఎంతోమంది పేద విద్యార్థులు నవోదయ సీట్లు సాధించేలా ఆమె కృషి చేశారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై న ఈశ్వరిని ఎంఈఓ ఆర్ శ్రీనివాసచారి, సహచర ఉపాధ్యాయులు అభినందించారు.
జిల్లా స్ధాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు 53 మంది ఎంపికయ్యారు. వారిలో 10 మంది ప్రధానోపాధ్యాయులు, 23 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 20 మంది స్కూల్‌అసెస్టెంట్లు ఉన్నారు. ఎంపికై న ప్రధానోపాధ్యాయుల్లో గిద్దలూరు జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం ఎం.సిద్దేశ్వరశర్మ, తాళ్లూరు మండలం తూర్పు గంగవరం జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం వై.ఎస్.ఆర్.కె.ప్రసాద్, బేస్తవారిపేట జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం మన్నం శ్రీదేవి, కొండపి మండలం, పెదకండ్లగుంట జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం పి.మహబూబ్ ఖాన్, కనిగిరి గరల్స్ హైస్కూల్ హెచ్‌ఎం జి.సంజీవి, మార్కాపురం మండలం, కంబాలదిన్నె జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం ఆర్.మాలకొండయ్య, యర్రగొండపాలెం మండలం, గంజివారిపాలెం జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం వి.సుబ్బారెడ్డి, కనిగిరి మండలం, చాకిచర్ల జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం టి.పెద్దిరెడ్డి, కొత్తపట్నం మండలం, ఈతముక్కల జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం సీహెచ్.చెంచుపున్నయ్య, నాగులుప్పలపాడు మండలం, వినోదరాయునిపాలెం జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం ఎల్.వి.ఎన్.రమేష్ లకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికై నట్లు తెలిపారు.

గురువులకు గుర్తింపు

గురువులకు గుర్తింపు

గురువులకు గుర్తింపు