
ఏఆర్ ఏఎస్పీగా కొల్లూరు శ్రీనివాసరావు
ఒంగోలు టౌన్: జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీగా కొల్లూరు శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్పీ ఏఆర్ దామోదర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన కొల్లూరు శ్రీనివాసరావు 1991లో ఆర్‌ఎస్‌ఐగా పోలీసు శాఖలో చేరారు. తొలి పోస్టింగ్ నెల్లూరు లో చేశారు. 2001లో ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొంది విజయవాడకు బదిలీ అయ్యారు. అక్కడ నుంచి 2003లో ఒంగోలు పీటీసీకు వచ్చారు. ఆ తరువాత 2003 నుంచి 2009 వరకు ఆర్‌ఐ హోంగార్డుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో విధులు నిర్వహించారు. 2009లో అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా టీటీడీలో పనిచేశారు. 2011లో డీఎస్పీగా పదోన్నతి పొందిన ఆయన గ్రే హౌండ్స్ విభాగంలో హైదరాబాద్, వైజాగ్‌లలో 2013 వరకు విధులు నిర్వహించారు. 2014లో నెల్లూరు డీటీసీ వైస్ ప్రిన్సిపాల్‌గా, 2014–18లో నెల్లూరు, ప్రకాశం హోంగార్డ్స్ డీఎస్పీగా పనిచేశారు. ఆ తరువాత విజిలెన్స్ డీఎస్పీగా ఏపీ జెన్‌కోకు బదిలీ అయిన ఆయన కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరులలో ఆరున్నరేళ్లు విధులు నిర్వహించారు. 2024 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కడప డీఎస్పీగా విధులు నిర్వహించారు. ఏఎస్పీగా పదోన్నతిపై ఒంగోలు ఏఆర్‌లో బాధ్యతలు చేపట్టారు.
కనిగిరిరూరల్: విద్యుత్ శాఖలోని కార్మిక సంఘాల ప్రకాశం జిల్లా జేఎసీ చైర్మన్ సీహెచ్ హరికృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు స్థానిక విద్యుత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సీహెచ్ హరి కృష్ణ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం తీవ్ర కాలయాపన చేస్తోందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 15వ తేదీ నుంచి సమ్మె చేపట్టేందుకు నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. సమ్మెను విజయవతం చేసేందుకు కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఒంగోలు టౌన్: ఒంగోలు మెడికల్ కాలేజీకి 30 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. ఇప్పటి వరకు 120 సీట్లు ఉండగా పెరిగిన సీట్లతో 150 కు చేరింది. ఇందులో ఇండియా కోటాలో 22 సీట్లు, స్టేట్ కోటాలో 128 సీట్లు వస్తాయి. దీంతో మన రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. అదనంగా మరో 50 సీట్లు కేటాయించాలని ఎన్‌ఎంసీకి ఇటీవల ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. పరిశీలన అనంతరం ఎన్‌ఎంసీ 30 సీట్లు పెంచుతూ నిర్ణయం తీసుకొందని వివరించారు. సీట్ల పెంపు కోసం పనిచేసిన కళాశాల సిబ్బందికి, ప్రొఫెసర్లకు ప్రిన్సిపాల్ అశోక్ కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు అభినందనలు తెలిపారు.
మార్కాపురం: మార్కాపురానికి చెందిన హాస్యబ్రహ్మ శంకర్‌నారాయణ వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నారు. బుధవారం హైదరాబాదులోని త్యాగరాయ గానసభ కళావేదికలో త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి వండర్‌బుక్ ఆఫ్ రికార్‌ుడ్స ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బీ నరేంద్రగౌడ్ శంకరనారాయణకు రికార్డును అందజేశారు. ఈ సందర్భంగా శంకర్‌నారాయణ మాట్లాడుతూ తాను 27 ఏళ్ల నుంచి దేశ విదేశాల్లో వేలాది హాస్య కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 550 హాస్యావధానాలు చేశానని, త్యాగరాయ గానసభలోనే 25 గంటలపాటు నిర్విరామ ప్రజా హాస్యావధానం నిర్వహించినట్లు చెప్పారు. దీంతో వండర్‌బుక్ ఆఫ్ రికార్‌ుడ్సలో నమోదుచేసి తనకు అందజేశారన్నారు.