
కుటుంబ వివాదాలతో వృద్ధురాలిపై దాడి
పొదిలి: కుటుంబ వివాదాల నేపథ్యంలో వృద్ధురాలిపై దాడి జరిగింది. ఈ సంఘటన పట్టణ పరిధిలోని మసీదురోడ్డులో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..షేక్ మస్తాన్‌బీ దంపతులకు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిలో ముగ్గురు కుమారులు బయట ఉంటుండగా ఒక కుమారుడు ఖాదర్‌బాషా తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. ఇటీవల ఆ ఇంటిని వృద్ధ దంపతులు కుమార్తె పేరుపై రాశారు. దీంతో ఆ ఇంట్లో నుంచి కొడుకును వెళ్లిపొమ్మని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో కుటుంబసభ్యుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. తనకు హక్కు ఉన్న ఇంటిని ఖాళీ చేయనని ఖాదర్‌బాషా ఎదురు తిరగడంతో ఆదివారం కుటుంబసభ్యుల మధ్య జరిగిన గొడవల్లో ఖాదర్‌బీకి గాయాలయ్యా యి. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కౌన్సెలింగ్ ఇస్తానని ఎస్సై వేమన తెలిపారు.