ఎకై ్సజ్‌లో పచ్చ పెత్తనం | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌లో పచ్చ పెత్తనం

Aug 7 2025 10:33 AM | Updated on Aug 7 2025 10:33 AM

ఎకై ్సజ్‌లో పచ్చ పెత్తనం

ఎకై ్సజ్‌లో పచ్చ పెత్తనం

● ఉన్నతాధికారులను సైతం లెక్క చేయని కిందిస్థాయి సిబ్బంది ● సూపరింటెండెంట్‌తో ఒంగోలు ఎకై ్సజ్‌ సీఐ వాగ్వాదం ● అధికార పార్టీ అండదండలతో పొదిలి ఎకై ్సజ్‌ సీఐని దూషించిన ఎస్సై ● ఎకై ్సజ్‌ శాఖలో పెత్తనం చెలాయిస్తున్న టీడీపీ మద్దతు సీఐలు ● డీసీ కార్యాలయంలోని ఒక ఎల్లో సీఐ ఫిర్యాదుతోనే గతంలో ఈఎస్‌ ఖాజా మొహిద్దిన్‌పై వేటు ? ● సుమారు రూ.2.50 కోట్లు కాజేసిన అధికారపార్టీ సామాజిక వర్గానికి చెందిన కానిస్టేబుల్‌

ఎకై ్సజ్‌ శాఖలో పచ్చ పెత్తనం పెచ్చుమీరిపోయింది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో కొందరు అధికారులు పనిచేస్తున్నారు. అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన కొందరు ఉద్యోగులే బరితెగిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతూ ప్రశ్నించిన ఉన్నతాధికారులపై సైతం తిరగబడుతున్నారు. కానిస్టేబుళ్ల నుంచి సీఐ స్థాయి అధికారుల వరకూ అందరిదీ ఇదే తీరు. ఈ ప్రభుత్వం మాది మేమేం చేసినా చెల్లుబాటవుతుందన్న అహంకారంతో వ్యవహరించడం విమర్శల పాలవుతోంది.

పొదిలి ఎస్సై సస్పెండ్‌...

ఇటీవల పొదిలి ఎస్సై సైమన్‌ను సస్పెండ్‌ చేయడం ఎకై ్సజ్‌ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో టీడీపీ నాయకులు, కార్యకర్తలే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో మద్యం దుకాణానికి అనుబంధంగా కనీసం 10 నుంచి 15 బెల్ట్‌ షాపులను అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇదంతా అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతోందని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పొదిలి ఎకై ్సజ్‌ ఎస్సై సైమన్‌కు ఒక వ్యక్తి వద్ద మూడు మద్యం బాటిళ్లు దొరికాయి. నిబంధనల ప్రకారం మూడు మద్యం బాటిళ్లు ఉండవచ్చు కనుక అతడిని ఆయన వదిలిపెట్టినట్లు సమాచారం. అయితే ఉన్నతాధికారులకు తెలియకుండా ఆయన బెల్ట్‌ షాపు నిర్వాహకుడిని పట్టుకొని వదిలేసినట్లు, ఈ విషయం గురించి ప్రశ్నించిన సీఐ అరుణకుమారిని దూషించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయనను మాత్రం ఆఘమేఘాల మీద సస్పెండ్‌ చేశారు. దీని మీద ఎకై ్సజ్‌ శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనా వ్యవస్థ కుప్పకూలిపోయింది. రాజకీయ జోక్యం మితిమీరడంతో అధికారులు చేష్టలుడిగి చూడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. అన్నీ ప్రభుత్వ శాఖల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పచ్చపార్టీ కార్యకర్తలు, నాయకులు నేరుగా ప్రభుత్వాధికారులను ఆదేశిస్తున్నారు. అవసరమైతే బెదిరింపులకు దిగుతున్నారు. ఎకై ్సజ్‌ శాఖలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఆ శాఖలో పనిచేస్తున్న అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులే బరితెగించి ప్రవరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఎకై ్సజ్‌ శాఖలో జరుగుతున్న పరిణామాలను ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొనవచ్చు. జిల్లా కేంద్రంలోని ఎలైట్‌ మాల్‌లో ఒక ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌ గుట్టుచప్పుడు కాకుండా రూ.2.50 కోట్ల మేర అవినీతికి పాల్పడినట్లు బయటపడింది. అయినా ఆయన మీద ఈగ వాలకుండా కూటమి ప్రభుత్వం కాపు కాయడం చూసి ప్రజలు నోటిమీద వేలేసుకున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన మరికొందరు ఉద్యోగులు ఉన్నతాధికారులపై తిరగబడి మాట్లాడడం లాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఇటీవల ఒంగోలు ఎకై ్సజ్‌ సీఐ ఒకరు ఏకంగా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌తో వాదన పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా ఇదేం పద్ధతి అనిఅడిగితే మమ్మల్నెవరురా ఆపేది అంటూ కాలరెగరేస్తున్నట్లు సహోద్యోగులు చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మాది మేమేం చేసినా చెల్లుబాటవుతుందన్న అహంకారంతో వ్యవహరించడం విమర్శల పాలవుతోంది.

పాత ఈఎస్‌ను సాగనంపారు...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈఎస్‌గా షేక్‌ ఖాజా మొహిద్దిన్‌ను పోస్టింగ్‌ ఇచ్చారు. ఆయన వచ్చినప్పటి నుంచి కూటమి నాయకులకు సానుకూలంగా వ్యవహరించారు. మీడియాతో మాట్లాడే సమయంలో కూడా తన స్వామి భక్తిని దాచుకోకుండా కూటమి పాట పాడేవారు. ఎంత పచ్చసేవలో పావనమైనప్పటికీ ఆయనను అధికార పార్టీ సామాజిక వర్గం వదిలిపెట్టలేదని ప్రచారం జరుగుతోంది. డీసీ కార్యాలయంలో పనిచేసే అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక సీఐ ఆయనపై పెత్తనం చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. దీన్ని ఆయన అంగీకరించకపోయే సరికి కథ అడ్డం తిరిగింది. అప్పటిదాకా మావాడే అనిచెప్పిన తమ్ముళ్లు ఆయనను సాగనంపేందుకు ప్లాన్‌ చేశారు. ఎల్లో సీఐ కనుసన్నల్లో కమిషనర్‌కు ఫిర్యాదులు పంపించినట్లు సమాచారం. అంతటితో ఊరుకోకుండా కమిషనర్‌ కార్యాలయంలో చక్రం తిప్పడంతో కూటమి ప్రభుత్వం ఖాజా మొహిద్దిన్‌ మీద వేటు వేసినట్లు తెలుస్తోంది. 2024 సెప్టెంబర్‌లో ఒంగోలులో ఈఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన చేత అన్నీ రకాలుగా ఊడిగం చేయించుకొని కేవలం 9 నెలలకే ఇంటికి పంపించారు. తన పరిధికి మించి కూటమి సేవ చేసినా ఆయనకు ఇప్పటి వరకు పోస్టింగు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఎకై ్సజ్‌ శాఖ ఉద్యోగులే చెప్పుకుంటున్నారు.

రూ.2.42 కోట్లు కాజేసినా చర్యల్లేవు...

ఈఎస్‌ను లెక్కచేయని ఆబ్కారీ సీఐ..

జిల్లా కేంద్రమైన ఒంగోలు ఎకై ్సజ్‌ సీఐ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన సీఐ లీనా గత కొంతకాలంగా ఉన్నతాధికారులకు సహకరించడంలేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ షేక్‌ ఆయేషా బేగం పోలీసు స్టేషన్‌ తనిఖీ నిమిత్తం వెళ్లారు. రికార్డు నిర్వహణ సక్రమంగా లేకపోవడాన్ని ప్రశ్నించారు. రికార్డులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. రికార్డులు ఇవ్వడానికి సీఐ తిరస్కరించడమే కాకుండా ఈఎస్‌ పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈఎస్‌ ఎదుటే చేతిలోని సెల్‌ఫోన్‌ను నేలకు విసిరి కొట్టి ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై అధికారితో దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ ఉన్న ఉద్యోగులు విస్మయానికి గురయ్యారు. విధి నిర్వహణలో వైఫల్యం చెందడమే కాకుండా జిల్లా అధికారి పట్ల దురుసుగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈఎస్‌ మీద దురుసుగా ప్రవర్తించిన సీఐ లీనాను కమిషనరేట్‌లో సరెండ్‌ మాత్రమే చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉందన్న అహంకారంతోనే సదరు సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కొందరు కిందిస్థాయి ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఇదేరీతిలో తాము వ్యవహరించి ఉంటే ఇప్పటికే సస్పెండ్‌ చేసి ఉండేవారని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement