
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
● ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమారెడ్డి
ఒంగోలు సిటీ: ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ అన్న కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు రాంనగర్ 5వ లైన్ల ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన నాలుగు డీఏలు, పీఆర్‌సీ కమిటీ, ఐఆర్ మధ్యంత భృతి వంటి విషయాల గురించి చర్చించామన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వరకుమార్, ఉపాధ్యక్షుడు రమణ వెంకటేశ్వరరెడ్డి, గోపికృష్ణ, కోశాధికారి రంగారెడ్డి, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, కోశాధికారి ఏసురత్నం, శ్రీనివాసరావు, సునీల్ జవహరాలి, తాలూకా అధ్యక్షుడు సురేష్ బాబు, కార్యదర్శి శ్రీదేవి, చంద్రశేఖర్ శ్రీనివాసులు మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మానస, వనజ, సుమతి, గౌరీ తదితరులు పాల్గొన్నారు.