
ప్రభుత్వ భవనాలు కబ్జా!
కంభం/రాచర్ల: వినియోగంలో లేని ప్రభుత్వ పాఠశాల గదులు, ప్రభుత్వ భవనాలను ప్రైవేట్ వ్యక్తులు సొంతానికి వినియోగించుకుంటున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంభం పంచాయతీ పరిధిలోని సాధుమియా వీధిలో పంచాయతీ నిధులతో సుమారు పదేళ్ల క్రితం పశువైద్యశాల నిర్మించారు. నేటికీ ఆ భవనాన్ని పశువైద్యాధికారులు స్వాధీనం చేసుకుని, సేవలందించేందుకు ముందుకు రాకపోవడంతో అది నిరుపయోగంగా ఉంది. ఈ భవనంలో ఓ టెంట్ హౌస్ నిర్వాహకుడు ఇటీవలే పాగా వేశాడు. కొద్ది రోజుల నుంచి టెంట్ హౌస్ సామగ్రిని భద్రపరుకుంటున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అలాగే రాచర్ల మండలం సత్యవోలు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పాఠశాల భవనంలో మకాం వేశాడు. సొంత ఇల్లు నిర్మించుకుంటున్న ఆయన.. స్కూల్ భవనంలో కాపురం పెట్టినా అధికారులు చోద్యం చూస్తున్నారు.
సొంతానికి వాడుకుంటున్న ప్రైవేట్ వ్యక్తులు
పట్టించుకోని అధికారులు

ప్రభుత్వ భవనాలు కబ్జా!