ఉచిత బస్సు ఎలా.? | - | Sakshi
Sakshi News home page

ఉచిత బస్సు ఎలా.?

Aug 6 2025 7:44 AM | Updated on Aug 6 2025 7:44 AM

ఉచిత

ఉచిత బస్సు ఎలా.?

ఉన్న బస్సులతో

మార్కాపురం: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15న ప్రవేశపెట్టనున్న ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ అధికారుల్లో టెన్షన్‌ పుట్టిస్తోంది. ఉన్న బస్సులతో ఎలా నడపాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొత్త బస్సులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం కూడా కొత్త బస్సులపై ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. దీంతో ఉన్న బస్సులను ఉచిత బస్సులుగా మారిస్తే కొన్ని రూట్లలో బస్సు సర్వీసులను రద్దు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ప్రయాణికుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఆ రూట్లలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటే సంస్థ ఆదాయం తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏం చేయాలో తెలియక

మల్లగుల్లాలు..?

మార్కాపురం డివిజన్‌లో మార్కాపురం, గిద్దలూరు, పొదిలి డిపోలు ఉన్నాయి. మార్కాపురం డిపోలో ప్రస్తుతం 90 ఆర్టీసీ బస్సులు, 16 హైర్‌ బస్సులు ఉన్నాయి. వీటిలో 50 పల్లెవెలుగు సర్వీసులు ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 39 వేల కిలోమీటర్లు తిరుగుతాయి. ఉచిత బస్సు అమలు చేస్తే మార్కాపురం, ఒంగోలు, నంద్యాల తదితర ప్రాంతాలకు నడిపే సర్వీసులను కొంత దూరం వరకే పరిమితం చేసే అవకాశం ఉంది. ఉచిత బస్సు అమలయ్యే తరువాత నుంచి మార్కాపురం నుంచి ఒంగోలుకు ప్రస్తుతం నడుపుతున్న ఆర్డీనరీ సర్వీసులను పొదిలి వరకు మాత్రమే నడపాలని అధికారులు తాత్కాలికంగా నిర్ణయించారు. ఇలా అయితే పొదిలి, ఒంగోలు మధ్య మార్కాపురం డిపో నుంచి ఆర్డినరీ సర్వీసులు తగ్గనున్నాయి. అలా చేస్తే ప్రయాణికులు ఇబ్బంది పడతారు.

ఉచిత బస్‌ ప్రయాణంపై ఆర్టీసీ అధికారుల్లో టెన్షన్‌

తగ్గనున్న బస్‌ రూట్‌లు

ఇప్పటికీ చాలా గ్రామాలకు ఆటోలే దిక్కు..

ఆ గ్రామాలకు ఆటోలే దిక్కు...

ఇప్పటికీ మార్కాపురం, తర్లుపాడు మండలాల్లోని పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు ఆటోల్లోనే మార్కాపురం వస్తుంటారు. మార్కాపురం మండలంలోని బోడపాడు, రాజుపాలెం, నాగులవరం, నికరంపల్లి, తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువు, మీర్జపేట, కారుమానిపల్లె తదితర గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ సౌకర్యం లేదు. ఈ గ్రామాల ప్రజలకు అత్యవసరమైనా సాధారణ పనైనా.. ఆటోల్లో, బొలెరో వాహనాల్లో పనులకు రావాల్సిందే. ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ నెల 15 నుంచి ప్రారంభించే ఉచిత సర్వీసులకు వీరు దూరం కానున్నారు. తమ స్వగ్రామాల నుంచి ఆటోల్లో మార్కాపురం వచ్చి తాము ప్రయాణం చేయాల్సిన గమ్యానికి వెళ్లాల్సిందే. ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం విషయంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఒక వైపు కొత్తబస్సులు రాకపోగా, ఉన్న బస్సులనే రాజధానికి జిల్లా కేంద్రానికి కేటాయిస్తే ప్రస్తుతం నడుస్తున్న సర్వీసుల్లో కొన్నైనా రద్దు చేయాల్సిందే. దీనితో ఎలా చేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఉచిత బస్సుపై ప్రజల్లో, ప్రభుత్వంపై వ్యతిరేకతో పాటు అయోమయం, గందరగోళం నెలకొంది.

ఉచిత బస్సు ఎలా.?1
1/1

ఉచిత బస్సు ఎలా.?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement