
దర్శి యువకుడు బెంగళూరులో మృతి
దర్శి: దర్శికి చెందిన మార్తుల ఖగోల్‌రెడ్డి (31) బెంగళూరులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విశ్రాంత ఎస్సై మార్తుల వెంకటేశ్వరరెడ్డి కుమారుడైన ఖగోల్‌రెడ్డి గత నాలుగేళ్లుగా లండన్‌లో ఉండి మాస్టర్ ఎంబీఏ పూర్తి చేశారు. గత మార్చిలో ఇండియా వచ్చి బెంగళూరులోని డేటా సెంటర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆది వారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహితుడితో కలిసి బెంగళూరు వస్కోట్‌లో ఉదయం 4 గంటల సమయంలో 4 ఏఎం బిర్యానీ పాయింట్‌కి మోటార్ సైకిల్‌పై వెళ్లారు. ఆ హోటల్ తీయకపోవడంతో తిరిగి వస్తుండగా, లలియ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే ఫ్లైఓవర్‌పై స్నేహితుడి హెల్మెట్ కిందపడింది. మోటార్ సైకిల్ వెనుకవైపు కూర్చుని ఉన్న ఖగోల్‌రెడ్డి కిందకు దిగి హెల్మెట్ తీసుకొస్తున్న సమయంలో హైవేపై వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో హైవేపైనుంచి కింద ఉన్న సర్వీస్ రోడ్డుపై పడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ఖగోల్‌రెడ్డి మృతిచెందాడు. సోమవారం బెంగళూరులోని ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. మంగళవారం దర్శిలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. విశ్రాంత ఎస్సై వెంకటేశ్వరరెడ్డికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా కుమార్తెలకు వివాహం జరిగింది. ఏకై క కుమారునికి పెళ్లి చేయాలని కలలు కంటున్న సమయంలో మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పుచ్చలమిట్టలోని వారి నివాసం వద్ద విషదం అలముకుంది.
రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
నాలుగేళ్లుగా లండన్‌లో ఉండి ఇటీవలే బెంగళూరు వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం