వైద్యశాలలో రాజకీయాలొద్దు | - | Sakshi
Sakshi News home page

వైద్యశాలలో రాజకీయాలొద్దు

Aug 5 2025 8:44 AM | Updated on Aug 5 2025 8:44 AM

వైద్యశాలలో రాజకీయాలొద్దు

వైద్యశాలలో రాజకీయాలొద్దు

హాస్పిటల్‌ అభివృద్ధికి కలిసికట్టుగా పాటుపడదాం

అంబులెన్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌

యర్రగొండపాలెం: ప్రభుత్వ వైద్యశాలలో రాజకీయాలకు తావివ్వవద్దని, హాస్పిటల్‌ అభివృద్ధికి తామందరం కలిసికట్టుగా పాటుపడదామని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నారు. స్థానిక ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. వివిధ రోగాలతో వైద్యశాలకు వచ్చిన పేదలను రక్త పరీక్షల కోసం బయటికి పంపుతున్నారని, ఇంజక్షన్‌లు, మందులు రాసిచ్చి మెడికల్‌ షాపుల వద్దకు పంపడం సరైంది కాదని, దీనివలన రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ అందుబాటులో ఉండకపోవడం, వైద్యశాలలో బ్లడ్‌ బ్యాంక్‌ లేకపోవడంతో రోడ్డు ప్రమాద బాధితులు అనేక మంది మృతి చెందారని, అటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటానన్నారు. బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని డీఆర్సీ, జెడ్పీ సమావేశాలలో అనేక పర్యాయాలు అడిగినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు. వైద్యశాలలో ఏర్పాటు చేస్తున్న భోజన కాంట్రాక్టర్‌ స్థానికంగా ఉండేలా చూడాలని, రోగులకు రెండు పూటలా మంచి భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్యశాలలో పూర్తి స్థాయిలో వైద్యులున్నా తగిన సదుపాయాలు, ల్యాబ్‌లు లేకపోవడంతో రోగులు ఈ హాస్పిటల్‌ను గుర్తించడం లేదని, ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లి రోగులు ప్రాణాలు పోగొట్టుకోవడంతోపాటు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. అభివృద్ధి కమిటీ సభ్యులుగా మందుల ఆదిశేషు, పాత్లావత్‌ బాలు నాయక్‌లను ఎమ్మెల్యే ప్రకటించారు. సభ్యులుగా నియమితులైన వారు బాధ్యతాయుతంగా వ్యవహరించి వైద్యశాలలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని అన్నారు. ఆర్థోపెడిక్‌ విభాగంలో సి–యాం మిషన్‌, ఆపరేషన్‌ థియేటర్‌కు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయడంతోపాటు మరో 10 తీర్మానాలు చేసి కమిటీ ఆమోదం తెలిపింది. అనంతరం వైద్యశాలకు మంజూరైన అంబులెన్స్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. పూర్తి సదుపాయాలు కలిగిన మరొక అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తున్నారని, వైద్యశాల మార్చురీలో ఫ్రీజర్‌ బాక్స్‌, మృతులను తమ నివాసాలకు చేర్చేందుకు వాహనాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యదిద్యా, డాక్టర్‌ ముబినా, డాక్టర్‌ రాంజీ నాయక్‌, ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్‌, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్‌, సర్పంచ్‌ ఆర్‌.అరుణాబాయి, పార్టీ జిల్లా కార్యదర్శి కె.ఓబులరెడ్డి, మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement