
భూ కబ్జా ఆపండి
మార్కాపురం: తమ పొలాలను కబ్జా చేసేందుకు ఒక టీడీపీ నాయకుడు ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ ఆదివారం మార్కాపురం మండలంలోని నాగులవరం గ్రామస్తులు ఆదివారం ధర్నా నిర్వహించారు. వారసత్వంగా వస్తున్న తమ పొలాలను మార్కాపురం పట్టణానికి చెందిన ఒక టీడీపీ నేత ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని, తమ భూములను కాపాడి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూ కబ్జా విషయంపై ఇప్పటికే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ధర్నాలో గ్రామానికి చెందిన మంగమ్మ, వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, గురుస్వామి, పెద్ద అంకయ్య, ఆంజనేయులు, లక్ష్మీదేవి తదితరులు పాల్గొని టీడీపీ నాయకుడి తీరును తూర్పారబట్టారు. తమకు ఆ పొలమే జీవనాధారమని, తమ పొలాన్ని సర్వే చేసి కబ్జా కాకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
మార్కాపురం మండలం నాగులవరంలో గ్రామస్తుల ధర్నా
టీడీపీ నాయకుడి తీరుపై ఆగ్రహం