
జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపిక
ఒంగోలు:
స్థానిక మంగమూరు రోడ్డులోని ఏసీఏ క్రికెట్ సబ్ సెంటర్ మైదానంలో ఆదివారం సీనియర్ మహిళా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్ 23, సీనియర్ మహిళా క్రికెట్ జట్ల ఎంపికకు ఉమ్మడి జిల్లా నుంచి మహిళా క్రికెటర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఫీల్డింగ్, బ్యాటింగ్, కీపింగ్, బౌలింగ్ తదితర అంశాల్లో క్రీడాకారుల ప్రతిభను కోచ్‌లు కొప్పోలు సుధాకర్, లెఫ్ట్ శ్రీను, చంద్ర పరిశీలించారు. మొత్తం 20 మంది ప్రతిభావంతులకు ఈనెల 9, 10వ తేదీల్లో బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతల క్రికెట్ స్టేడియంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం వారిలో 16 మంది క్రీడాకారులను తుది జట్టుకు ఎంపిక చేస్తామని ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎంపికై న జట్లు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు ఎన్‌టీఆర్ జిల్లా మూలపాడులో నిర్వహించనున్న అంతర్ జిల్లా క్రికెట్ పోటీల్లో ప్రకాశం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఎంపిక ప్రక్రియను ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్‌కుమార్, సంయుక్త కార్యదర్శి బచ్చు శ్రీనివాసరావు, కోశాధికారి హనుమంతరావు, సభ్యులు బలరాం పర్యవేక్షించారు.