రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు 49 మంది ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు 49 మంది ఎంపిక

Aug 1 2025 12:31 PM | Updated on Aug 1 2025 12:31 PM

రాష్ట

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు 49 మంది ఎంపిక

యర్రగొండపాలెం: జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అడక్‌ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గిరిజన గురుకుల పాఠశాలలో గురువారం జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలో 49 మంది ఎంపికయ్యారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 200 మంది ఎంపికలో పాల్గొన్నారని అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పి.రామచంద్రరావు, ఎం.వెంకటరెడ్డి తెలిపారు. పాల్గొన్న వారిలో అండర్‌–14లో 12 మంది, అండర్‌–16లో 28 మంది, 18, 20 ఏళ్ల యువతీ, యువకులు 9మంది ప్రకారం ఎంపికయ్యారని, వీరు బాపట్ల జిల్లా చీరాలలో జరిగే 36వ జూనియర్‌ సౌత్‌జోన్‌ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ మీట్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి

మార్కాపురం: ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన గురువారం మార్కాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పెద్దారవీడు గ్రామానికి చెందిన వేశపోగు ఏసమ్మ(72) ప్రతి రోజు ఉదయం పూట మార్కాపురం వచ్చి కూరగాయలు కొనుగోలు చేసి పెద్దారవీడు ప్రాంతంలో అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో బుధవారం ఆమె మార్కెట్‌కు వచ్చి కూరగాయలు కొనుగోలు చేసి తీసుకువెళుతున్న క్రమంలో ఎదురుగా వచ్చిన ఆటో ఏసమ్మను ఢీకొట్టింది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక జీజీహెచ్‌లో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సాంకేతిక సమస్యతో నిలిచిన గూడ్స్‌ రైలు

గిద్దలూరు రూరల్‌: సాంకేతిక సమస్యతో గూడ్‌ రైలు నిలిచిపోయింది. ఈ సంఘటన పట్టణంలోని రాచర్ల గేటు వద్ద గురువారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నుంచి గుంతకల్‌ వైపుగా వెళ్లే గూడ్స్‌ రైలు ఇంజన్‌లో సాంకేతిక మరమ్మతుల కారణంగా రాచర్ల గేటు వద్ద సుమారు అరగంట సేపు నిలిచిపోయింది. దీంతో పట్టణంలోని రాచర్ల గేటు దాటి అవతలి వైపుకు వెళ్లే వాహనదారులు రోడ్డు పై అలాగే నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరగంట తరువాత ఇంజన్‌లో మరమ్మతులు చేయడంతో రైలు ముందుకు కదిలింది. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు 49 మంది ఎంపిక 1
1/2

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు 49 మంది ఎంపిక

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు 49 మంది ఎంపిక 2
2/2

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు 49 మంది ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement