
వసతులు లేక ఇబ్బంది పడుతున్నాం
మా ఊరి బడిని బాగుచేయాలి
సుందరయ్య కాలనీలోని మా పాఠశాల ఏమీ బాగోలేదు. నేలపైనే కూర్చుని చదువుకోవాల్సిన పరిస్ధితి. పాఠశాల ఏర్పాటై ఏళ్లు గడుతున్నా కనీస వసతులు లేవు. రోజూ ఇబ్బందులు పడుతున్నాం. ఫర్నిచర్‌తో పాటు అధిక గదులున్న భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
– ప్రభు కుమార్, 4వ తరగతి, మార్కాపురం
వర్షం
కురిస్తే పాఠశాలలో కష్టం
విద్యార్థులకు సరిపడా రూములు లేవు. ఉన్న రెండు రూముల్లో ఒకటి వంటశాలగా వాడుతున్నారు. మేము వరండాలో రేకుల కింద కూర్చుంటున్నాం. రేకులకు తుప్పుపట్టి రంధ్రాలు ఏర్పడటంతో వర్షం కురిసినప్పుడల్లా తరగతులు నిలిచిపోతున్నాయి. ఎండా కాలంలో ఆ రేకుల కింద కూర్చోలేకపోతున్నాం.
– రోహన్, 5వ తరగతి
విద్యార్థి, మార్కాపురం
కాలనీ పిల్లలు చదువుకోవడానికి సరైన వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు పంపే స్థోమత లేక ఊర్లో గవర్నమెంట్ బడికి పంపుతున్నాం. పిల్లలంతా ఇరుకుగా ఉన్న వంట గదిలో కూర్చోవడం చూస్తే బాధగా ఉంది. అధికారులు స్పందించి మా ఊరి బడిని బాగు చేయాలని కోరుతున్నాం.
– పెరికె రాణెమ్మ,బచ్చలకూరపాడు

వసతులు లేక ఇబ్బంది పడుతున్నాం

వసతులు లేక ఇబ్బంది పడుతున్నాం