
మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించాలి
ఒంగోలు సబర్బన్: స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. సూక్ష్మరుణ ప్రణాళిక (మైక్రో క్రెడిట్ ప్లాన్), ఏసీఎల్‌పీ(యాన్యువల్ క్రెడిట్ అండ్ లైవ్‌లీహుడ్ ప్లాన్) పథకాలు అమలు చేయడంతో పాటు లబ్ధిపొందేలా చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం ప్రకాశం భవన్‌లోని సమావేశ మందిరంలో డీఆర్‌డీఏ, వ్యవసాయ, పశు సంవర్ధక, సెరీకల్చర్, చేనేత–జౌళి శాఖ, పరిశ్రమలు, ఉద్యాన శాఖ, ఎల్‌డీఎం తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలకు ఏఏ శాఖల్లో సబ్సిడీ యూనిట్స్ అమలు చేస్తున్నారో అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలోని 45,297 స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన 4,46,026 మందిలో పీ4 కార్యక్రమానికి ఎంపిక చేసిన వారికి ప్రాధ్యానత ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ నారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా సెరీకల్చర్ అధికారి సంజయకుమార్, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాసరావు, ఎల్‌డీఎం రమేష్ కుమార్, జిల్లా చేనేత జౌళి శాఖాధికారి, ఫుడ్ ప్రాసెసింగ్ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా