
పీఆర్సీ లేదు.. బకాయిల్లేవు
● బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు పర్రె వెంకటరావు
ఒంగోలు సిటీ: బహుజన ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణే బహుజన టీచర్స్ అసోసియేషన్ లక్ష్యమని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పర్రె వెంకటరావు పేర్కొన్నారు. బుధవారం బహుజన టీచర్స్ అసోసియేషన్ 25వ ఆవిర్భావ సదస్సును స్థానిక సంఘ కార్యాలయంలో నిర్వహించారు. పర్రె వెంకటరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిటీ వేయకుండా, బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేయడం సరికాదన్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో బహుజనుల హక్కులు కాపాడటంతో బీటీఏ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏల్చూరి మాధవరావు మాట్లాడుతూ.. యాప్‌ల భారం తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంకా ఎక్కువ చేయడం తగదని అన్నారు. జిల్లా కార్య నిర్వాహక అధ్యక్షుడు కర్ర దేవసహాయం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పారాబత్తిన జాల రామయ్య మద్ధిరాల శరత్ చంద్రబాబు, పల్లె తిరుపతిస్వామి, కొండమూరి కొండలరాయుడు, చెక్క కోటేశ్వరరావు, మిర్యాల వెలుగొండయ్య, గాలిమోటు భాస్కరరావు, బొంత కళ్యాణ్, టి.రాజ్ కుమార్, కొప్పోలు కిషోర్, నన్నేసాని భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.