
సెలవు పెడితే ఇక అంతే...
జిల్లాలోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఏదైనా అత్యవసర పనుల మీద సెలవు పెట్టాల్సి వచ్చినప్పుడు పక్క స్కూలు నుంచి డిప్యుటేషన్ మీద మరో ఉపాధ్యాయుడిని నియమించే అవకాశం కూడా ఉండడం లేదని సమాచారం. దాంతో టీచర్ సెలవు పెడితే విద్యార్థులకు కూడా అప్రకటిత సెలవు ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.
చదువుతో పాటుగా పర్యవేక్షణ ఎలా..
ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి చదువు చెప్పడం ఎంత కష్టమో వారిని పర్యవేక్షించడం కూడా అంతకన్నా కష్టమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఒకరికి ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్న స్కూళ్లో ఈ సమస్యను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు కానీ ఏకోపాధ్యాయ స్కూళ్లలో పర్యవేక్షణ చేయలేక ఉపాధ్యాయులు చేతులెత్తేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించడం గగనమైపోతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.