
జూనియర్ బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక
కందుకూరు రూరల్: ఉమ్మడి ప్రకాశం జిల్లా బాల, బాలికల బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు కందుకూరు టీఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం ఆదివారం నిర్వహించారు. జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 30 మంది బాలుర, 25 మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 12 మంది బాలుర, 12 మంది బాలికలను జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న జట్లు వచ్చే నెల 14 నుంచి 17వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలో జరిగే 10వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొంటారని ఉమ్మడి ప్రకాశం బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు వలేటి రవీంద్ర, టి.సుబ్బారావు తెలిపారు. ఎంపిక కార్యక్రమంలో మార్కాపురం పీడీ రమాదేవి, పీడీలు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, కె.చిట్టెమ్మ, క్విజ్ కళాశాలకు చెందిన కోచ్ శివకుమారిలు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
టంగుటూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని సూరారెడ్డిపాలెం సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు, జాతీయ రహదారి అంబులెన్సు సిబ్బంది తెలిపిన వివరాల మేరకు..కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లు సూరారెడ్డిపాలెం సమీపంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు కిందపడగా గుర్తుతెలియని వాహనం అతని కాలుపై నుంచి వెళ్లడంతో కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జాతీయ రహదారి అంబులెన్సులో జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

జూనియర్ బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక

జూనియర్ బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక