
పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
యర్రగొండపాలెం: సకుటుంబ సమేతంగా మిత్రులంతా ఒకచోట చేరి సందడి చేశారు. అలనాటి జ్ఞాపకాలను ఒకరికొకరు చెప్పుకొని ఆనందపడ్డారు. నాటి జ్ఞాపకాలను నెమేరుకొని మనసారా నవ్వుకున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1976–78 నుంచి 1980–82వరకు విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఎంంతో ఉత్సాహంగా సాగింది. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, ఉద్యోగ విరమణ చేసినవారు 120 మంది పూర్వ విద్యార్థులు, వారి కుటుంబాలు కలిసి ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా పూర్తిగా వెనకబడిన యర్రగొండపాలెంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన సమితి ప్రెసిడెంట్ దివంగత వేగినాటి కోటయ్య సతీమణి కాశమ్మను వారంతా ఘనంగా సన్మానించారు.