
అమరులారా వందనం
● గత ఏడాది జూన్‌లో తూర్పు లడఖ్ సమీపంలో సైనిక విన్యాసాలు చేస్తుండగా యుద్ద ట్యాంక్ నీటిలో కొట్టుకుపోయి ఐదుగురు జవాన్లు మరణించారు. వారిలో రాచర్ల మండలానికి చెందిన జేసీఓ ముత్తుముల రామకృష్ణారెడ్డి ఉన్నారు.
● గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లి గ్రామానికి చెందిన సంగిరెడ్డి సంజీవరెడ్డి నాలుగేళ్లళ్ల క్రితం సిక్కింలో మంచు కొండల చరియలు పడి మృతి చెందారు.
● గతేడాది డిసెంబర్‌లో కంభం మండలం రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య జమ్మూలోని పూంచ్ సెక్టార్‌లో కాపలా కాస్తున్న సమయంలో మందుపాతర పేలి మృతి చెందారు.
● కంభంకు చెందిన నంద్యాల శ్రీనివాసులు 2004లో శ్రీనగర్‌లో జరిగిన ఆపరేషనన్ రక్షక్‌లో అమరుడయ్యారు. ఆయన మరణించే నాటికి భార్య వకులాదేవి 6 నెలల గర్భిణి. నంద్యాల శ్రీనివాసులుకు మరణాంతరం విశిష్ట సేవా మెడల్ దక్కింది.
● కంభం మండలంలోని తురిమెళ్ల గ్రామానికి చెందిన పత్తి వెంకట నారాయణ 1988లో శ్రీలంకలో చేపట్టిన ఆపరేషన్ పవన్‌లో పాల్గొన్నారు. యుద్ధభూమిలో వీరమరణం పొందిన ఆయనకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.
● కంభం మండలం తురిమెళ్లకు చెందిన సీహెచ్ రంగస్వామి 1962లో చైనా యుద్ధంలో, ఎం.రంగారెడ్డి 1965లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందారు. కంభం పట్టణానికి చెందిన జి.గాలెయ్య 2006లో ఆపరేషన్ రక్షక్‌లో, ఎల్‌కోట గ్రామానికి చెందిన జి.శ్రీనివాసులు 1999 కార్గిల్ యుద్దంలో తుది శ్వాస విడిచారు.

అమరులారా వందనం

అమరులారా వందనం

అమరులారా వందనం

అమరులారా వందనం