
బూచేపల్లిని కలిసిన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా (పార్లమెంట్) నియమితులైన కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావులు పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబులను ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీ మిధున్‌రెడ్డి అరెస్టు అక్రమం
● మాజీ ఎమ్మెల్యేలు అన్నా, జంకె
మార్కాపురం టౌన్: ఎంపీ మిధున్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేయడం అక్రమమని మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులను అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడం దారుణమని అన్నారు. వైఎస్సార్ సీపీ నేత, లోక్‌సభ పక్ష నేత అయిన మిధున్‌రెడ్డిని మద్యం కేసులో అరెస్టు చేయడాన్ని వారు ఖండించారు. లేని కేసును సృష్టించి అబద్ధపు సాక్షాలతో ఎంపీని అరెస్టు చేసిన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సిట్‌ను ఏర్పాటుచేసి అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం మంచిపద్ధతి కాదన్నారు. మిధున్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలని కోరారు.
భూములను పరిశీలించిన ఏపీఐఐసీ అధికారులు
దొనకొండ: దొనకొండ ప్రాంతంలోని బాదాపురం రెవెన్యూలోని భూములను ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మదన్ మోహన్‌తో కలిసి డీఆర్‌డీఓ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఆదివారం పరిశీలించారు. ఈ ప్రాంతంలో బ్రహ్మోస్ క్షిపణులు తయారు చేయడానికి అనుకూలమైన ప్రాంతమని, సుమారు 400 ఎకరాలు అవసరమని వారు తెలిపారు. కనిగిరి ఆర్‌డీఓ జి.కేశవర్థనరెడ్డి ఈ ప్రాంత విషయాలను, అనుకూల పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత రెవెన్యూ మ్యాపులు పరిశీలించారు. ఈ భూముల్లో ఆక్రమణలు ఉన్నాయా, రైతులు పంటలు పండించుకునే భూములా వంటి విషయాలపై రెవెన్యూ వారి నుంచి సమాచారం సేకరించారు. అనంతరం పాత ఎయిర్ పోర్టును పరిశీలించారు. ఇది ప్రాథమిక సర్వే మాత్రమేనని, మళ్లీ క్షుణ్ణంగా పరిశీలిస్తామని వారు తెలిపారు. వారి వెంట ఏపీఈడీబీ అధికారి ఐశ్వర్య కోశరాజు, తహసీల్దార్ బి.రమాదేవి, ఏపీఐఐసీ సర్వేయర్ అనిల్, డిటీ కెవి.నాగార్జునరెడ్డి, లైసెన్స్ సర్వేయర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

బూచేపల్లిని కలిసిన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు