మహా నివాళి! | - | Sakshi
Sakshi News home page

మహా నివాళి!

Jul 9 2025 7:01 AM | Updated on Jul 9 2025 7:01 AM

మహా న

మహా నివాళి!

జన బాంధవుడికి..

వాడవాడలా సేవా కార్యక్రమాలు

దర్శి నియోజకవర్గంలో మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ నేతృత్వంలో అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరిగాయి. దర్శి వైఎస్సార్‌ సెంటర్‌లో అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. శివరాజ్‌నగర్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్వీట్లు, పుస్తకాలు పంపిణీ చేశారు. ముండ్లమూరు మండల కేంద్రంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి. వెంకాయమ్మ పాల్గొన్నారు. కురిచేడు బస్టాండ్‌సెంటర్‌లో పార్టీ నాయకులు అన్నదానం, మండలం పడమర వీరాయిపాలెం లోనిశ్రీ కరుణా వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. దొనకొండ పట్టణంలో పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

కొండపిలో..

వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ సింగరాయకొండ, టంగుటూరు మండలాల్లో జరిగిన వైఎస్సార్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సింగరాయకొండ కందుకూరు రోడ్డు సెంటర్‌, బాలయోగినగర్‌ ఆర్చి, సుందర్‌నగర్‌, మూలగుంటపాడు, పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని వైఎస్సార్‌కు నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేసి అన్నదానం చేశారు. బాలయోగినగర్‌లో దుస్తులు పంపిణీ చేశారు.

ఆరోగ్య ప్రదాత వైఎస్సార్‌

చరిత్రలో గుర్తు పెట్టుకోగలిగిన నాయకుడు, ‘ఆరోగ్యశ్రీ’ తో ప్రజల గుండెల్లో నిలిచిన ఆరోగ్యప్రదాత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కొనియాడారు. మంగళవారం ఒంగోలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్‌ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి వైద్య శిబిరంలను ముఖ్య అతిథులుగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ ప్రారంభించారు. వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు, మాజీ మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మేరుగు నాగార్జున, ఎస్సీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావులు ముఖ్య అతిథులుగా పాల్గొని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 45వ డివిజన్‌లో, చర్చి సెంటర్‌లోని వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. కేక్‌ కటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ చరిత్రలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో పేదల కోసం పనిచేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని అన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని మ్యానిఫెస్టోలో పెట్టి రైతు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుందన్నారు. 108, 104, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రజలకు దగ్గర చేసిన నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. ఇటువంటి నాయకుడిని చరిత్ర గుర్తు పెట్టుకుంటుందన్నారు. వైఎస్సార్‌ హాయాంలో ఎమ్మెల్యేగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో డాక్టరు వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిలిచిఉన్నారని, చిరస్మరణీయుడని కొనియాడారు. వైఎస్సార్‌ ఆశయాలన్నింటినీ గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారన్నారు. 2029 లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు. పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు. సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారన్నారు.

వై.పాలెంలో..

మహానేత వైఎస్సార్‌ జయంతిని వైపాలెం నియోజకవర్గంలో వాడవాడలా నిర్వహించారు. వై.పాలెంలోని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ కార్యాలయంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు వైఎస్సార్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. పుల్లలచెరువు, పెద్దారవీడు, పెద్దదోర్నాల, త్రిపురాంతకంలో ఆ పార్టీ నాయకులు వైఎస్సార్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు.

రాజన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు ఊరూ..వాడ అన్నదానాలు రక్తదాన శిబిరాలు.. వృద్ధాశ్రమాల్లో పండ్లు, దుస్తుల పంపిణీ

మహా నివాళి!1
1/2

మహా నివాళి!

మహా నివాళి!2
2/2

మహా నివాళి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement