అడుగంటిన ఆశలు | - | Sakshi
Sakshi News home page

అడుగంటిన ఆశలు

Jul 8 2025 4:37 AM | Updated on Jul 8 2025 4:37 AM

అడుగం

అడుగంటిన ఆశలు

అడుగంటి పోతున్న కంభం చెరువు (ప్రస్తుతం 5 అడుగులు ఉన్న నీటిమట్టం)

గోవిందాపురం సమీపంలో చెరువు నీళ్ళతో చిన్నపాటి చెరువులను తలపిస్తున్న బీడుభూములు

పెద్దకంభం తూములనుండి లీకేజి ద్వారా పంటకాల్వల్లో పారుతున్న నీళ్ళు

కంభం: ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్దదైన కంభం చెరువు నిండితే మూడేళ్ల వరకు ఆయకట్టు కింద అధికారికంగా 6944 ఎకరాలు, అనధికారింగా 12 వేల ఎకరాలు సాగులో ఉండేది. ప్రస్తుతం సకాలంలో వర్షాలు కురవకపోవడంతో చెరువులో నీళ్లు చేరే పరిస్థితులు కనబడటంలేదు. మే నెలలో అడపా దడపా భారీ వర్షాలు కురిసినా కంభం చెరువుకు నీరుచేరే నల్లమల అటవీ ప్రాంతంలో కురవకపోవడంతో చెరువుకు నీళ్లు చేరలేదు.

నీటికష్టాలు తప్పవా:

కంభం చెరువులో నీళ్లుంటే చుట్టుపక్కల 20 కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలు పుష్కలంగా ఉండి ఆ గ్రామాల్లో నీటి సమస్య ఉండదు. ప్రస్తుతం చెరువులో 5 అడుగుల మేర నీళ్లు ఉండగా ఇరిగేషన్‌ అధికారులు తూము ఎత్తడంతో నీటి మట్టం తగ్గిపోతోంది. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో నీటి సమస్య తలెత్తుతోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీళ్లు అందించారు. ట్యాంకర్ల ద్వారా టీడీపీ నాయకులు భారీగా డబ్బులు సంపాదించుకున్నారన్న విమర్శలు అప్పట్లో తీవ్రంగా వినిపించేవి. ఆ తర్వాత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాలు పుష్కలంగా పడి కంభం చెరువులో కొంత మేర నీళ్లు చేరడంతో ట్యాంకర్ల అవసరం లేకుండానే ఐదేళ్లు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీళ్లు అందించారు. ప్రస్తుతం చెరువు నీళ్లు అడుగంటి పోతుండటంతో వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు అడుగంటితే మళ్లీ ట్యాంకర్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అప్పుడలా..ఇప్పుడేమో ఇలా..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో కంభం చెరువులో సుమారు 10 అడుగుల నీళ్లున్నప్పటికీ పంటల సాగుకు రైతులకు నీళ్లు వదిలితే చెరువు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోతాయన్న ఉద్దేశంతో జిల్లా ఉన్నతాధికారులు పొలాలకు నీళ్లు వదిలేందుకు అనుమతించలేదు. తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు మొరబెట్టుకున్నా తూములు ఎత్తేందుకు ససేమిరా అన్నారు. ప్రస్తుతం కంభం చెరువులో నీటి మట్టం 5 అడుగులకు పడిపోయి అడుగంటుతున్నా దర్గా గ్రామంలో కేవలం 70 ఎకరాల్లో సాగులో ఉన్న పత్తి పంట కోసం రెండుసార్లు చిన్నకంభం తూములు ఎత్తడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వృథాగా పోతున్న కంభం చెరువు నీళ్లు:

ఇప్పటికే చిన్నకంభం, పెద్దకంభం, నక్కల గండి తూముల వద్ద లీకేజిల ద్వారా చాలా వరకు నీళ్లు వృథాగా వెళ్లిపోతున్నాయి. వాటిని అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్‌ అధికారులు చెరువులో ఉన్న కొద్దిపాటి నీళ్లను కాపాడుకోవడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. దర్గా గ్రామంలో రైతుల కోసం నీళ్లు వదలగా ఆ నీళ్లు చిన్నకంభం, గోవిందాపురం గ్రామాల మీదుగా పంటకాల్వల గుండా వెళ్తున్నాయి. దారి పొడువునా పంటల కాల్వలు సక్రమంగా లేకపోవడంతో గోవిందాపురం సమీపంలో ఉన్న పలు బీడు భూములు చెరువు నీళ్లతో నిండిపోయి చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. ఇన్ని నీళ్లు వృథాగా వెళ్లిపోతున్నా ఇరిగేషన్‌ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. నక్కల గండి తూమును సైతం రాత్రి వేళల్లో పలువురు అక్రమంగా ఎత్తుకొని పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నారు.

కంభం చెరువు నీటి సామర్థ్యం: 3.30 టీఎంసీలు

ప్రస్తుతం చెరువులో ఉన్న నీటి మట్టం: 5 అడుగులు

సాగు విస్తీర్ణం: అధికారికంగా 6944 ఎకరాలు

అడుగంటుతున్న చారిత్రాత్మక కంభం చెరువు నీటిమట్టం గతంలో పది అడుగుల నీళ్లున్నా రైతులకు నీళ్లొదలని ఇరిగేషన్‌ అధికారులు ప్రస్తుతం 5 అడుగులుంటేనే తూములెత్తేసిన వైనం ఇప్పటికే తూముల లీకేజి ద్వారావృథాగా వెళ్లిపోతున్న నీళ్లు భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం

ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యంతో చారిత్రాత్మక కంభం చెరువు అడుగంటుతోంది. వర్షాలు లేక చెరువు నీళ్లు 5 అడుగులకు పడిపోగా.. ఉన్న నీటినీ ఇరిగేషన్‌ అధికారులు తూములెత్తి వదిలేయడంతో ఆ నీరు తూముల లీకేజీల ద్వారా వృథాగా పోతోంది. చెరువులో నీరు లేకపోవడంతో పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం పొంచి ఉంది. ఉన్న కొద్దిపాటి నీళ్లనూ కాపాడుకోవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దర్గా రైతుల కోసం తూములు ఎత్తాం

దర్గా గ్రామంలో పత్తి రైతులకు నీళ్లు కావాలని అడిగితే చిన్నకంభం తూములు ఎత్తాం. 15 రోజుల క్రితం ఒకసారి, ప్రస్తుతం రెండో సారి తూములు ఎత్తాం. నీళ్లు వృథాగా వెళ్లకుండా చర్యలు తీసుకుంటాం.

– శ్రీను నాయక్‌, ఇరిగేషన్‌ ఏఈ, కంభం

నీరు వృథాకాకుండా చూడాలి

కంభం చెరువు నీళ్లు వృథా కాకుండా ఇరిగేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలి. చెరువులో నీళ్లు అయిపోతే భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉంది. అప్పుడు మండలంలో నీటి సమస్య తలెత్తుతుంది. చెరువు నీళ్లు వృథాగా వెళ్లకుండా ఇరిగేషన్‌ అధికారులు దృష్టి సారించాలి.

– చేగిరెడ్డి తులశమ్మ, ఎంపీపీ కంభం

గ్రామంలో ఇప్పటికే నీటి సమస్య ఉంది

సూరేపల్లి గ్రామంలో ఎప్పుడూ నీటి సమస్య ఉంటుంది. చెరువులో నీళ్లున్నా 500 అడుగులకు పైగా బోర్లు వేసినా నీళ్లు పడని పరిస్థితి. చెరువు ఎండిపోతే ఎన్ని అడుగులు వేసినా ఈ గ్రామంలో నీళ్లు పడవు. అధికారులు నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

– బిజ్జం వెంకటేశ్వరరెడ్డి, సూరేపల్లి

అడుగంటిన ఆశలు1
1/5

అడుగంటిన ఆశలు

అడుగంటిన ఆశలు2
2/5

అడుగంటిన ఆశలు

అడుగంటిన ఆశలు3
3/5

అడుగంటిన ఆశలు

అడుగంటిన ఆశలు4
4/5

అడుగంటిన ఆశలు

అడుగంటిన ఆశలు5
5/5

అడుగంటిన ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement