ఎకై ్సజ్‌ అధికారుల తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ అధికారుల తనిఖీలు

Jul 8 2025 4:35 AM | Updated on Jul 8 2025 4:35 AM

ఎకై ్

ఎకై ్సజ్‌ అధికారుల తనిఖీలు

టంగుటూరు: మండలంలోని ఎం.నిడమానూరు, పొందూరు గ్రామాల్లో ఒంగోలు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ లీనా, ఎస్సై గీత వారి సిబ్బందితో కలిసి సోమవారం తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనంపై మద్యం విక్రయించడం గురించి.. మంత్రి ఇలాకాలో మొ‘బైక్‌’ మద్యం అనే శీర్షికతో సోమవారం సాక్షి దినపత్రిక మెయిన్‌ పేజీలో ప్రచురితమైన కథనానికి జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు సీఐ, ఎస్సైలు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ లీనా మాట్లాడుతూ ఎక్కడైనా అనధికారికంగా మద్యం నిల్వ చేయడం, విక్రయించడం చేస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, అనధికారికంగా మద్యం నిల్వలు, విక్రయాలపై తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కాగా, ఆదివారం బైక్‌పై మద్యం విక్రయించిన వ్యక్తిని టంగుటూరు ఎస్సై అదుపులోకి తీసుకుని తహసీల్దార్‌ వద్ద బైండోవర్‌ చేసినట్లు తెలిపారు.

కార్లు అద్దెకు తీసుకుని వేధిస్తున్నారని ఫిర్యాదు

ఒంగోలు టౌన్‌: తన కార్‌ ట్రావెల్స్‌లో మూడు కార్లు అద్దెకు తీసుకుని అద్దె చెల్లించకుండా, తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ బాధితుడు సోమవారం ఎస్పీ దామోదర్‌కి ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఒంగోలు మారుతీనగర్‌కు చెందిన వ్యక్తి.. తాను కార్‌ ట్రావెల్స్‌ నిర్వహిస్తూ జీవిస్తుండగా, ఒంగోలు సమతా నగర్‌కు చెందిన వ్యక్తి మూడు కార్లను అద్దెకు తీసుకున్నాడని, ఏడు నెలలైనా ఒక్క రూపాయి అద్దె చెల్లించకుండా కార్లను కూడా ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 79 ఫిర్యాదులు రాగా, బాధితులు ఎస్పీని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.

ఎకై ్సజ్‌ అధికారుల తనిఖీలు 1
1/1

ఎకై ్సజ్‌ అధికారుల తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement