
ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలి
ఒంగోలు టౌన్: అధిక ధరలకు మద్యం విక్రయాలు చేయకుండా ఎకై ్సజ్ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు ఆదేశించారు. స్థానిక డీసీ కార్యా లయంలో బుధవారం నెలవారీ నేర సమీక్షా సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 10 ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు జరిగేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. దుకాణాల్లో అన్నీ బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గంజాయితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం అరికట్టేందుకు గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. అనధికార మద్యం విక్రయాలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. లోక్ అదాలత్‌ను అధికారులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. పెండింగ్ కేసులు ఉంటే వెంటనే పరిష్కరించాలని చెప్పారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను త్వరితగతిన వేలం వేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఆయేషా బేగం, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు ఈ.వెంకట్, ఏ.జనార్దన్‌రావు, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.